మరోసారి రవితేజతో అనిల్ రావిపూడి.. ఆ సీక్వెల్ కోసం ఫిక్స్ అయినట్లే?
టాలీవుడ్ లో ఫెయిల్యూర్ అనేది తెలియని దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. ఎలాంటి సినిమా చేసినా కూడా మినిమమ్ ఎంటర్టైన్మెంట్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాడు. బాక్సాఫీస్ వద్ద అనిల్ సినిమాలు ఏ స్థాయిలో కలెక్షన్స్ రాబడతాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే నెక్స్ట్ ఈ స్టార్ దర్శకుడు ఎలాంటి సినిమాతో వస్తాడు అనే విషయంలో ఇంతవరకు అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వలేదు.
ఒక లేడి ఓరియెంటెడ్ కథతో పాటు F2సినిమా తరహాలోనే F3 తో త్రిబుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని ఒక కామెడీ కథను రెడీ చేసుకున్నాడు. వెంకటేష్, వరుణ్ తేజ్ అలాగే హీరోయిన్స్ ఇద్దరు కూడా ఫిక్స్ అయ్యారు గాని మరొక హీరో విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. అయితే మూడవ హీరో కోసం రవితేజని ఫిక్స్ చేసే అవకాశం ఉన్నట్లు చాలా రోజులుగా రూమర్స్ వస్తున్నాయి. ఇంతకుముందు రవితేజతో అనిల్, రాజా ది గ్రేట్ సినిమా చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమాతోనే రవితేజ బౌన్స్ బ్యాక్ అయ్యాడు.

రాజా ది గ్రేట్ అనంతరం రవితేజ ఒక్క హిట్టు కూడా కొట్టలేదు. దీంతో మరోసారి అనిల్ తోనే సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. మరి ఆ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. అనిల్ రావిపూడి F3ని అయితే జనవరిలో స్టార్ట్ చేసి సమ్మర్ లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడు. అలాగే బాలకృష్ణతో కూడా ఒక సినిమా చేయాలని ప్లాన్ వేసుకుంటున్నట్లు సమాచారం. ఇక మహేష్ తో అనుకున్న ప్రాజెక్టు ఇప్పట్లో రాకపోవచ్చని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











