For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  NBK108: బాలయ్య కోసం బాలీవుడ్ బ్యూటీ.. స్టార్ డైరెక్టర్ ముంబై టూర్

  |

  నందమూరి తారక రామారావు కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు స్టార్ హీరోగా ఎదిగిపోయారు నటసింహా నందమూరి బాలకృష్ణ. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను అందుకున్న ఆయన.. పలు విజయాలతో పాటు స్టార్‌డమ్‌ను, మార్కెట్‌ను కూడా పెంచుకున్నారు. దీంతో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నారు. అయితే, చాలా కాలం పాటు బాలయ్య పరాజయాల పరంపరతో ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లోనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన 'అఖండ'తో ఆయన మరోసారి హిట్ ట్రాక్ ఎక్కడంతో పాటు కెరీర్‌లోనే భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు.

  Mehreen Kaur Pirzada: మెహ్రీన్ అందాల విందు.. అబ్బో ఆమె డ్రెస్ చూస్తే!

  'అఖండ' వంటి భారీ సక్సెస్ తర్వాత నటసింహా బాలకృష్ణ ఫుల్ జోష్‌తో కనిపిస్తున్నారు. ఈ ఉత్సాహంతోనే ఫ్యూచర్ ప్రాజెక్టులను సైతం లైన్‌లో పెట్టుకున్నారు. ఇందులో 'క్రాక్' మూవీ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ప్రస్తుతం 'జై బాలయ్య' (పరిశీలనలో ఉన్న టైటిల్) అనే సినిమా చేస్తున్నారు. పల్నాడు ఫ్యాక్షన్ నేపథ్యంతో రియల్ స్టోరీల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే మొదలైన ఈ మూవీ షూటింగ్.. శర వేగంగా సాగుతోంది. ఇందులో భాగంగానే చిత్ర యూనిట్ పలు షెడ్యూళ్లను కూడా జరుపుకుంది. వీటిలో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక, ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్న విషయం తెలిసిందే.

  గోపీచంద్‌ మలినేనితో చేస్తోన్న సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగానే నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడితో ప్రాజెక్టును కూడా లైన్‌లో పెట్టుకున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్ కోసం నందమూరి అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు అనుగుణంగానే అప్పుడే అనిల్ రావిపూడి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టేశాడు. అంతేకాదు, డైలాగ్ వెర్షన్‌తో కూడిన స్క్రిప్టును కూడా రెడీ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం కాబోతుంది.

  షార్ట్ డ్రెస్‌లో యాంకర్ హరితేజ రచ్చ: నడిరోడ్డు మీదే అలా.. వీడియో వైరల్

  Anil Ravipudi Approaches Sonakshi Sinha for Balakrishna Movie

  క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ సరసన నటించే హీరోయిన్ గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇందులో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీని తీసుకోబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా కోసం సోనాక్షి సిన్హాను దర్శకుడు సంప్రదించినట్లు తెలిసింది. ఇందుకోసం డైరెక్టర్ అనిల్ రావిపూడి తాజాగా ముంబై వెళ్లి ఆమెకు స్టోరీని వినిపించినట్లు కూడా ఓ న్యూస్ లీకైంది. అయితే, ఇందులో నటించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? లేదా? అన్నది మాత్రం సస్పెన్స్‌గా మారిపోయింది.

  నందమూరి బాలకృష్ణ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాకు 'Bro I Don't Care' బ్రో ఐ డోంట్ కేర్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారని వార్తలు వస్తున్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను సరికొత్త పంథాలో తెరకెక్కించబోతున్నారట. ఇక, ఇందులో అంజలి, ప్రియమణి కీలక పాత్రలను చేస్తున్నారని అంటున్నారు. అలాగే, శ్రీలీలా.. బాలయ్య కూతురిగా నటించబోతుందట.

  English summary
  Nandamuri Balakrishna Will Do a Movie Under Anil Ravipudi Direction. Now The Director Approaches Sonakshi Sinha for This Film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X