ఆ రూమర్స్ కు అనిల్ రావిపూడి చెక్.. నెక్ట్స్ ఏంటో నేనే చెప్తానంటూ..
Anil Ravipudi: వరుస కమర్షియల్ విజయాలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక బ్రాండ్‌ను సృష్టించుకున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). రాజమౌళి తర్వాత అత్యధిక హిట్ రేషియోను నమోదు చేసిన దర్శకుడిగా ఆయనకు ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం దక్కింది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన 'మనశంకర వరప్రసాద్ గారు' ఘన విజయంతో అనిల్ రావిపూడి మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ సక్సెస్‌తో ఆయన పేరు మళ్లీ ట్రెండింగ్‌లోకి రావడం విశేషం. ఈ ఘన విజయం తర్వాత ఆయన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై టాలీవుడ్‌లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.
మన శంకర వర ప్రసాద్ గారు భారీ సక్సెస్ తర్వాత అనిల్ రావిపూడి నెక్ట్స్ సినిమా ఏంటన్నది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. గత కొన్ని రోజులుగా ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పై రకరకాల రూమర్లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా మరోసారి వెంకటేష్ (Venkatesh)తో సినిమా చేయబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగింది. దీనితో పాటు నటీనటుల ఎంపికపై కూడా రోజుకో కొత్త కథనం వైరల్ అవుతోంది. ఈ సినిమాలో మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil)కూడా భాగమవుతారన్న ప్రచారం జోరుగా సాగింది. ఇలా అనిల్ రావిపూడి- వెంకటేష్ సినిమా అంటూ భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో స్పందించిన అనిల్ రావిపూడి, తన పీఆర్ ద్వారా అధికారిక సందేశం విడుదల చేశారు. తన తదుపరి సినిమా గురించి ఏ సమాచారం ఉన్నా అది కేవలం తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారానే ప్రకటిస్తానని స్పష్టం చేశారు. మీడియా, సోషల్ మీడియాల్లో వస్తున్న నిర్ధారణ లేని వార్తలను ప్రచురించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాంటి ఊహాగానాలు ప్రాజెక్ట్‌పై అనవసర గందరగోళం సృష్టిస్తాయని అభిప్రాయపడ్డారు.
ఇవన్నీ ఆపేందుకు అనిల్ రావిపూడి ఓస్టేట్‌మెంట్ విడుదల చేశారు. 'నా నెక్ట్స్ సినిమా గురించి అధికారిక అప్‌డేట్ నా సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారానే వస్తుంది. దయచేసి మీడియా,సోషల్ మీడియా యూజర్లు ఎలాంటి నిర్ధారణ లేని విషయాలను ప్రచారం చేయవద్దు. అధికారిక ప్రకటన త్వరలోనే ఉంటుంది... అందరూ కాస్త ఓపిక పట్టండి' అంటూ ఆయన కోరారు. అభిమానులు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతూ, అధికారిక అనౌన్స్‌మెంట్ వరకూ వెయిట్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే అభిమానులు చూపిస్తున్న ఉత్సాహానికి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తానని చెప్పిన అనిల్ రావిపూడి, అప్పటివరకు ఎలాంటి రూమర్లను నమ్మొద్దని స్పష్టమైన సంకేతం ఇచ్చారు. 'మన శంకర వర ప్రసాద్ గారు' సక్సెస్ తర్వాత అనిల్ రావిపూడి నెక్ట్స్ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నప్పటికీ, అధికారిక అప్డేట్ వచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందేనని దర్శకుడు మరోసారి గుర్తు చేశారు. అయితే.. అభిమానులంతా ఎదురుచూస్తున్నది ఒక్కటే... అనిల్ రవిపూడి నెక్ట్స్ సినిమా అనౌన్స్‌మెంట్ ఎప్పుడు వస్తుందన్నదే.


Click it and Unblock the Notifications











