F3 రిలీజ్ డేట్‌పై అనిల్ రావిపూడి క్లారిటీ: కొత్తది అప్పుడే ప్రకటిస్తామని వెల్లడి

ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చి.. ఊహించని విధంగా సూపర్ డూపర్ అయిన చిత్రం 'F2' (ఫన్ అండ్ ఫ్రస్టేషన్). విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటించిన ఈ చిత్రాన్ని సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించాడు. ఇందులో తమన్నా, మెహరీన్ హీరోయిన్లు. ఇద్దరు హీరోలు వివాహం తర్వాత ఎదుర్కొన్న పరిస్థితులను ఫన్నీగా చూపిస్తూ ఈ సినిమాను రూపొందించారు. ఇది ఘన విజయాన్ని అందుకోవడంతో దీనికి సీక్వెల్‌ను కూడా తీస్తున్నారు. తాజాగా ఈ మూవీ విడుదలపై క్లారిటీ వచ్చింది.

అమేయ (అనన్య) క్యూట్ అండ్ గ్లామరస్ ఫొటోస్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'F2' (ఫన్ అండ్ ఫ్రస్టేషన్)కు సీక్వెల్‌గా వస్తున్న చిత్రమే 'F3'. ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. అంతేకాదు, దాదాపుగా ఈ మూవీ చిత్రీకరణ చాలా వరకు పూర్తయింది. ఈ మధ్య కరోనా ప్రభావం పెరగడంతో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో షూటింగ్‌ను నిలిపేశారు. దీంతో సినిమా విడుదల తేదీ కూడా వాయిదా పడిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌పై దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. చాలా తెలుగు సినిమాల మాదిరిగానే దీన్ని కూడా వాయిదా వేస్తున్నట్లు తెలిపాడు.

Anil Ravipudi Clarity about F3 Release

తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన అనిల్ రావిపూడి.. 'కరోనా ప్రభావం రోజు రోజుకూ పెరుగుతోన్న నేపథ్యంలో 'F3' చిత్రాన్ని వాయిదా వేస్తున్నాం. కొత్త రిలీజ్ డేట్‌పై త్వరలోనే ప్రకటన చేస్తాం' అని వెల్లడించాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ మూవీ షూట్‌ను వచ్చే నెల నుంచి పున: ప్రారంభించాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో సునీల్ కీలక పాత్రను పోషిస్తుండగా.. తెలుగు హీరోయిన్ అంజలి కూడా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X