మహేష్, బాలయ్య సినిమాలపై క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి
వరుసగా బాక్సాఫీస్ హిట్స్ తో అగ్ర హీరోలను ఆకర్షిస్తున్న కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం F3 సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. వెంకటేష్, వరుణ్ తేజ్ నటిస్తున్న ఆ సినిమాలో మరొక స్టార్ హీరో కూడా కనిపిస్తాడని రూమర్స్ గట్టిగానే వస్తున్నాయి. ఇక అనిల్ చేయబోయే భవిష్యత్తు ప్రాజెక్టులపై కూడా అనేక రకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే.
మహేష్ బాబుతో మరో సినిమా చేయనున్నట్లు ముందే కమిట్మెంట్ తీసుకున్న అనిల్ బాలకృష్ణతో కూడా సినిమా చేయాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాడు కానీ కుదరడం లేదు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ ఇద్దరి హీరోల సినిమాలపై ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. మహేష్ బాబుతో మరోసారి మాట్లాడాలని అంటూ బాలకృష్ణ ప్రాజెక్ట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదని అన్నాడు.

ఇక రామ్ పోతినేనితో కూడా ఎప్పటి నుంచో ఒక సినిమా చేయాలని ఆనుకుంటున్నట్లు చెప్పిన అనిల్ మొదట పటాస్, రాజా ది గ్రేట్ వంటి కథలు చెప్పినప్పటికీ కుదరలేదట. ఇక త్వరలోనే పెండింగ్ లో ఉన్న మూడు ప్రాజెక్ట్ లలో ఒక ప్రాజెక్ట్ ఫిక్స్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు అనిల్ వివరణ ఇచ్చారు.
బాలకృష్ణతో చేయబోయే సినిమాను మాత్రం దిల్ రాజు ప్రొడక్షన్ లోనే నిర్మించే అవకాశం ఉన్నట్లు ఇటీవల రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక అనిల్ సమర్పకుడిగా వ్యవహరించి మాటలు స్క్రీన్ ప్లే అందించిన గాలి సంపత్ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











