ఆ ఉద్దేశంతోనే ఆమెను అంతలా బతిమిలాడా: అనిల్ రావిపూడి

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసిన చిత్రయూనిట్.. తాజాగా మీడియాతో ముచ్చటించింది. ఇందులో భాగంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి, ఈ సినిమాలో విజయశాంతిని తీసుకోవడంపై స్పందించారు.

దాదాపు పదమూడేళ్ల తర్వాత మళ్ళీ ముఖానికి రంగేసుకుంది లేడీ అమితాబ్ విజయశాంతి. 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాలో విజయశాంతి క్యారెక్టర్ హైలైట్ కానుందని, విజయశాంతి- మహేష్ బాబు మధ్య షూట్ చేసిన సన్నివేశాలు ప్రేక్షకుల మన్ననలు పొందుతాయని తెలుస్తోంది.

Anil Ravipudi Comments On Vijayashanthi role in SariLeru Neekevvaru

అయితే తాజాగా మీడియా సమావేశంలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. 'సరిలేరు నీకెవ్వరు' సినిమా కన్నా ముందే 'రాజా ది గ్రేట్‌' సినిమా కోసం విజయశాంతి గారిని కలిశానని చెప్పారు. ఆ తర్వాత 'సరిలేరు నీకెవ్వరు' లైన్‌ అనుకున్నానని.. అప్పుడే ఈ పాత్రకు విజయశాంతిగారి పేరును రాసేసుకున్నానని చెప్పారు. కథ మహేష్ బాబుకు చెప్పిన తర్వాత 'మేడమ్‌ను కలవబోతున్నా' అని ఆయనకు చెప్పగా.. 'ఆవిడ చేస్తారా' అని మహేష్ అడిగారని అనిల్ తెలిపాడు.

'నాకు ఆవిడతో పరిచయం ఉంది. వెళ్లి అడుగుతా' అని తాను మహేష్‌తో చెప్పి.. ఒకసారి కాదు, నాలుగైదు సార్లు వెళ్లి కలిసి విజయశాంతిని రిక్వెస్ట్‌ చేశానని అనిల్ రావిపూడి చెప్పాడు. ఈ పాత్రలో ఆమెను తప్ప మరొకరిని ఊహించుకోలేనని అన్నాడు. 'మరో నటి ఎవ్వరు చేసినా కుదరదు.. వేరే వాళ్లు చేస్తే ఆ మ్యాజిక్ రాదు. అది మిస్సవకూడదనే ఉద్దేశంతోనే అంతలా బతిమిలాడా' అని అనిల్ రావిపూడి అన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X