రాజమౌళికి పోటీగా అనిల్ రావిపూడి.. ఎలా అంటే?
ఒక దర్శకుణ్ణి సినిమాలో నిలబెట్టేది తన ట్రాక్ రికార్డు మాత్రమే అని చెప్పాలి. తీసేది ఏ జానర్ సినిమాలు అయినప్పటికీ అపజయం అనేది ఎరుగకుండా సినిమాలు తీస్తే ఆ దర్శకుని నుంచి వచ్చే సినిమాల కోసం జనం ఇంకా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. కాగా ఇలా మన తెలుగు సినిమాల దగ్గర ఇప్పటివరకు ఒక్క ప్లాప్ కూడా చూడని దర్శకుడు ఎవరు అంటే డౌట్ లేకుండా మొట్ట మొదటి ప్లేస్ లో ఉండే పేరు ఎస్ ఎస్ రాజమౌళి.
తన సినిమాలని లోకల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ వరకు తీసుకెళ్లి ఇపుడు తాను గ్లోబల్ దర్శకునిగా కూడా నిలిచిపోయారు. కాగా మన తెలుగు సినిమా దగ్గర రాజమౌళి తర్వాత తీసిన ప్రతీ సినిమా హిట్ గా ఉన్న దర్శకుల్లో నెక్స్ట్ నిలిచే దర్శకుడుగా మాత్రం అనీల్ రావిపూడి నిలవడం విశేషం. కాగా అనీల్ రావిపూడి ఇప్పుడు వరకు చేసిన 8 సినిమాలు అన్నీ హిట్ నుంచి బ్లాక్ బస్టర్స్ గానే నిలిచాయి.

తాను ఓ నిర్మాతతో సినిమా చేస్తే అది అతనికి కాసుల వర్షం కురిపించాల్సిందే. ఇలా లేటెస్ట్ గా తన నుంచి వచ్చిన "సంక్రాంతికి వస్తున్నాం" తో తెలుగులో ఇపుడు ఉన్న జెనరేషన్ లో మాత్రం రాజమౌళి తర్వాత అంత సక్సెస్ రేట్ ఉన్న దర్శకునిగా అత్యధిక సినిమాలతో అనీల్ రావిపూడి మాత్రమే నిలిచారు. కాగా ఈ విషయంలో జక్కన్నతో పోటీగా ఉన్న అనీల్ రావిపూడి మరో క్రేజీ అంశంలో కూడా రాజమౌళికి పోటీగా ఉన్నారని చెప్పాలి.
కాగా ఇండియన్ సినిమాల దగ్గర సీక్వెల్స్ అనే మాటకు వన్నె తీసుకొచ్చిందే రాజమౌళి అని తెలిసిందే. ఇలా తన నుంచి భారీ సీక్వెల్స్ తో తన డ్రీం ప్రాజెక్ట్ "మహాభారతం" కి రంగం సిద్ధం చేస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని ఏకంగా తాను పది భాగాలుగా చేస్తానని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇపుడు తనతో సక్సెస్ పరంగా పక్కనే ఉన్న అనీల్ రావిపూడి నుంచి కూడా ఎన్నో సీక్వెల్స్ రానున్నాయట.
అనీల్ రావిపూడి వెంకటేష్ కలయికలో వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయి అనేది తెలిసిందే. కాగా వీటికి ఆల్రెడీ ఎఫ్ 4 కూడా ఉన్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. కాగా లేటెస్ట్ గా వెంకీ మామ తమ నుంచి ఏకంగా ఎఫ్ 10 వరకు సినిమాలు వస్తూనే ఉంటాయి అంటూ తెలిపారు.
అంటే సీక్వెల్స్ పరంగా వీరి నుంచి నాన్ స్టాప్ గా కొనసాగింపు సినిమాలు ఉండనున్నాయని చెప్పాలి. సో జక్కన్న ఎలాగైతే మొత్తం పది సీక్వెల్స్ పాన్ చేసుకున్నారో ఇపుడు అనీల్ రావిపూడి నుంచి కూడా మొత్తం 9 సీక్వెల్ సినిమాలు వచ్చేలా ఉన్నాయని చెప్పాలి. దీనితో హిట్స్ పరంగా ఆ ట్రాక్ రికార్డు లోనే కాకుండా సీక్వెల్స్ పరంగా జక్కన్నతో మరో పాయింట్ కలిసింది అని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications











