సుకుమార్, కొరటాల కంటే బెటర్.. మాట నిలబెట్టుకున్న అనిల్ రావిపూడి
పటాస్ చిత్రంతో దర్శకుడిగా మొదటి విజయాన్ని అందుకున్నాడు అనిల్ రావిపూడి. అసిస్టెంట్ డైరెక్టర్, రైటర్‌గా సినీ ఇండస్ట్రీలో దాదాపు పదేళ్లు కష్టాలు పడ్డ అనిల్ రావిపూడి.. పటాస్‌తో ప్రస్థానం మొదలు అప్రతిహతంగా దూసుకుపోతూనే ఉన్నాడు. సుప్రీమ్, రాజాది గ్రేట్, ఎఫ్2 సినిమాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. మీడియం రేంజ్ డైరెక్టర్‌గా మినిమమ్ గ్యారెంటీ ఉన్న ఈ డైరెక్టర్‌కు ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో చాన్స్ వచ్చింది.

కథను ఓకే చేయించుకున్న దర్శకుడు..
మహర్షి చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కాగా.. అటుపై చేయబోయే తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించి ఎన్నో కథలను విన్నాడు. పరుశురామ్ లాంటి దర్శకులు క్యూలో ఉన్నా కూడా అనిల్ తన వద్ద ఉన్న కథను చెప్పి ఓకే చేయించుకున్నాడు. అయితే కథను ఓకే చేయించుకోవడమే పెద్ద విషయం అనుకుంటే చెప్పిన టైమ్‌కు రావడం మరో విశేషం.

మహేష్ ప్రాజెక్ట్ అంటే లేట్..
మామూలుగా మహేష్ చిత్రాలంటే ఆలస్యంగానే తెరకెక్కుతాయి. అది దర్శకుల వైఫల్యమో, హీరోగారి వైఫల్యమో తెలియదు గానీ మహేష్ గత చిత్రాలు ఆలస్యం అవుతూ వచ్చేవి. పెద్ద హీరోల సినిమాలంటేనే ఆ మాత్రం ఆలస్యం ఉంటుందని ఫ్యాన్స్ కూడా సర్దుకు పోయిన సందర్భాలున్నాయి.

శరవేగంగా షూటింగ్
అనిల్ రావిపూడి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మహేష్‌తో కథను ఓకే చేయించుకోవడం, చకాచకా షూటింగ్‌ను పూర్తి చేయడం, అనుకున్నటైమ్‌కు రిలీజ్ చేస్తుండటంతో అందరూ అవాక్కవుతున్నారు. వచ్చే సంక్రాంతికి మహేష్ బాబు సినిమాను రెడీ చేస్తానని చెప్పిన మాటను నిలబెట్టుకున్నాడు. సీనియర్ డైరెక్టర్లైన సుకుమార్, కొరటాల శివల కంటే ఎంతో బెటర్ అని కామెంట్లు చేస్తున్నారు. వారు ఓ సినిమాను చేశాక చాలా గ్యాప్ తీసుకోవడం, చిత్రాన్ని ఆలస్యంగా తెరకెక్కిస్తూ ఉంటారు.

ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్..
భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్న సరిలేరు నీకెవ్వరు సినిమా అంతకంటే భారీ ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎల్బీ స్టేడియంలో జనవరి 5న గ్రాండ్‌గా నిర్వహించబోతోన్నారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించి మెగా అభిమానుల మనసు దోచుకునేందుకు ప్లాన్ చేశారు. సంక్రాంతి కానుకగా రాబోతోన్నఈ మూవీ జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











