‘ఎఫ్ 3’లో సునీల్ రచ్చ.. సూపర్ ఫాస్ట్‌గా అనిల్ రావిపూడి
అనిల్ రావిపూడి ఎంత స్పీడ్‌గా సినిమాలను తెరకెక్కిస్తాడో అందరికీ తెలిసిందే. తాను ఓ ప్లాన్ వేసి షెడ్యూల్ ఫిక్స్ చేశాడంటే అలా జరగాల్సిందంటే. సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి హీరోతోనే దాదాపు 60 70 రోజుల్లో సినిమాను తీసేశాడు.బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు. అయితే అలాంటి అనిల్ రావిపూడి ప్లానింగ్‌కు కరోనా కాస్త అడ్డుకట్ట వేసింది. అందుకే ఇప్పుడు అంతకు మించిన వేగంతో దూసుకెళ్తున్నాడు.
అనిల్ రావిపూడి ఈ ఏడాది సంక్రాంతికే ఎఫ్ 3 సినిమాను లైన్‌లో పెట్టేయాలని భావించాడు. కానీ కరోనా ఎంతకీ తగ్గకపోవడంతో ఆప్రయత్నాలు విరమించుకున్నాడు. మొత్తానికి ఆలస్యంగా సినిమా షూటింగ్ మొదలుపెట్టినా కూడా శరవేగంగా దూసుకుపోతోన్నాడు. చకచకా గ్యాప్ లేకుండా షూటింగ్ కానిచ్చేస్తున్నాడు. ఓ షెడ్యూల్ అయ్యాక మరో షెడ్యూల్‌కు గ్యాప్ కూడా లేకుండా నిర్విరామంగా షూటింగ్ చేస్తున్నాడు.

తాజాగా ఎఫ్ 3 సినిమా షూటింగ్ అప్డేట్‌ను అనిల్ రావిపూడి ఇచ్చాడు. రెండో షెడ్యూల్ పూర్తయిందని మళ్లీ వెంటనే ఎప్పుడు సెట్ మీదకు వెళ్తానో అని ఎంతో ఎదురుచూస్తున్నాను.. ఇక మూడో షెడ్యూల్ పూర్తయిన వెంటనే మళ్లీ అప్డేట్లు ఇస్తాను అని చెప్పుకొచ్చాడు. సెట్‌లో వరుణ్ తేజ్, వెంకటేష్, సునీల్‌తో అనిల్ రావిపూడి ముచ్చట్లు పెడుతున్న ఫోటోను షేర్ చేశాడు. ఈ మూవీ ఆగస్ట్ 27న విడుదలకు సిద్దంగా ఉంది.


Click it and Unblock the Notifications











