NBK108: బాలయ్య ఫ్యాన్స్‌కు పండగ.. అసలైంది పూర్తి చేసిన అనిల్ రావిపూడి
దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్‌గా వెలుగొందుతూ హవాను చూపిస్తున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి వచ్చినా.. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను సొంతం చేసుకుని స్టార్‌గా ఎదిగిపోయారు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకెళ్తున్నారు. అయితే, మధ్యలో చాలా ఏళ్ల పాటు వరుస పరాజయాలతో సతమతం అయిన ఆయన.. మధ్యలో కొన్ని భారీ విజయాలను అందుకున్నారు. మళ్లీ 'గౌతమిపుత్ర శాతకర్ణి' తర్వాత ఫ్లాపుల పరంపరతో ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలోనే గత ఏడాది వచ్చిన 'అఖండ'తో ఆయన మరోసారి హిట్ ట్రాక్ ఎక్కడంతో పాటు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ సక్సెస్‌ను సొంతం చేసుకున్నారు.
'అఖండ' తర్వాత నటసింహా నందమూరి బాలకృష్ణ రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్నారు. ఈ జోష్‌లోనే తన ఫ్యూచర్ ప్రాజెక్టులను వరుస పెట్టి లైన్‌లో పెట్టుకుంటున్నారు. ఇందులో భాగంగానే గత ఏడాది 'క్రాక్'తో భారీ విజయాన్ని దక్కించుకున్న డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ప్రస్తుతం సినిమా చేస్తున్నారు. పల్నాడు ఫ్యాక్షన్ నేపథ్యంతో నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే మొదలైన ఈ మూవీ షూటింగ్.. రెండు మూడు షెడ్యూళ్లను కూడా జరుపుకుంది. ఇందులో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక, ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి.

యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో చేస్తోన్న సినిమా పట్టాలపై ఉండగానే నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ప్రాజెక్టును కూడా లైన్‌లో పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్ కోసం నందమూరి అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు అనుగుణంగానే అప్పుడే అనిల్ రావిపూడి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టేశాడు. ఈ వర్క్ కూడా ఎంతో వేగంగా సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అవి పూర్తైన వెంటనే దీన్ని పట్టాలెక్కించేలా ప్లాన్ చేసుకుంటున్నారు.
అంచనాలకు అనుగుణంగానే రాబోతున్న ఈ సినిమా కోసం అనిల్ రావిపూడి తొలిసారి కామెడీకి ప్రాధాన్యత తగ్గించి ఓ పవర్‌ఫుల్ సబ్జెక్టును రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు వర్కును దర్శకుడు పూర్తి చేసుకున్నాడట. అంతేకాదు, డైలాగ్స్‌తో కూడిన వెర్షన్‌ను రెడీ చేసుకున్నాడని తెలుస్తోంది. ఇది నందమూరి బాలకృష్ణకు వినిపించాలని డిసైడ్ అయ్యాడట. దీనికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే వెంటనే షూటింగ్ ప్రారంభించాలని అనుకుంటున్నాడట అనిల్. ఒకవేళ ఏదైనా మార్పులు చేయాల్సి వచ్చినా అందుకు సిద్ధంగానే ఉన్నాడట. మొత్తానికి ఈ సినిమాపై అనిల్ రావిపూడి బాగా ఫోకస్ చేస్తున్నాడు.
నందమూరి బాలకృష్ణ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ సినిమాకు 'Bro I Don't Care' బ్రో ఐ డోంట్ కేర్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారని ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను సరికొత్త పంథాలో రూపొందించబోతున్నారట. ఇక, ఇందులో అంజలి, ప్రియమణి కీలక పాత్రలను చేస్తున్నారని అంటున్నారు. అలాగే, శ్రీలీలా.. బాలయ్య కూతురిగా నటించబోతుందట. దీంతో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు ఏర్పడ్డాయి.


Click it and Unblock the Notifications











