అనిల్ రావిపూడి నయా రికార్డు.. బాక్సాఫీస్ లోనే కాదు బుల్లి తెరపై కూడా..
Anil Ravipudi: టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరు అనిల్ రావిపూడి. వరుస విజయాలతో తనకంటూ ఓ ప్రత్యేక బ్రాండ్‌ను నిర్మించుకున్నాడు. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలతో ప్రేక్షకులను అలరించే ఆయన, దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి దాదాపు ప్రతి సినిమా విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలో బాక్సాఫీస్ ఎన్నో రికార్డులను క్రియేట్ చేశారు. తాజాగా బాక్సాఫీస్ వద్ద కాదు.. బుల్లి తెరపై కూడా అనిల్ రావిపూడి నయా రికార్డు క్రియేట్ చేశారంట. ఇంతకీ ఆ రికార్డు ఏంటీ?
ప్రస్తుతం సోషల్ మీడియాలో అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమాల టెలివిజన్ టీఆర్పీ రేటింగ్స్ వైరల్ అవుతున్నాయి. ఆ టీఆర్పీ రేటింగ్స్ చేస్తే.. ఆయన సినిమాలకు కేవలం థియేటర్లలో మాత్రమే కాకుండా బుల్లితెరపైనా ఆదరణ అందుకుంటున్నాయని అర్థమవుతోంది. ముఖ్యంగా అనిల్ సినిమాలన్ని ఫ్యామిలీ ఎంటర్టైనర్లే. అందుకే థియేటర్లలో హిట్ అయిన తర్వాత టీవీలో ప్రసారం అయినప్పుడు కూడా ప్రేక్షకులు ఆసక్తిగా వీక్షిస్తుంటారు. ఇలా సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాకుండా టెలివిజన్ ప్రీమియర్లలో కూడా భారీ టీఆర్పీ రేటింగ్స్ సాధించడం ఆయన సినిమాల ప్రత్యేకత.

టీఆర్పీ వివరాల ప్రకారం.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రాల్లో సరిలేరు నీకెవ్వరూ (Sarileru Neekevvaru) సినిమా అత్యధికంగా 24.2 టీఆర్పీ రేటింగ్ సాధించింది. అదే విధంగా ఎఫ్ 2 (F2) 18.6 టీఆర్పీ, మాస్ మహారాజా 'రాజా ది గ్రేట్'మూవీ 18.4 టీఆర్పీ సాధించింది. ఇక గతేడాది సంకాంత్రి బరిలో నిలిచిన విక్టరీ వెంకటేష్ - అనిల్ కాంబోలో వచ్చిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam)కూడా భారీ టీఆర్పీని సొంతం చేసుకుంది. ఈ మూవీ 18.3 టీఆర్పీ రేటింగ్స్ సాధించాయి. అలాగే పటాస్, సుప్రీం, ఎఫ్ 3, భగవంత్ కేసరి వంటి సినిమాలు కూడా మంచి టీవీ రేటింగ్స్ సాధించాయి.
ఇటీవల మెగాస్టార్ చిరంజీవి - అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన సినిమా 'మన శంకర వర ప్రసాద్ గారు (Mana Shankara Vara Prasad Garu)'సినిమా . సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నయా రికార్డులను క్రియేట్ చేసింది. దాదాపు మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. థియేటరికల్ రన్ పూర్తి అయిన తరువాత టెలివిజన్ లో ప్రసారమైంది. ఇక బుల్లితెరపై మంచి రికార్డు నమోదు చేసింది. జీ తెలుగులో ప్రసారమైన ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్‌లో 14.2 టీఆర్పీ సాధించింది.
అనిల్ రావిపూడి సినిమాల విజయానికి ప్రధాన కారణం ఆయన కథ, కథనం.. ఆయన కామెడీతో ఫ్యామిలీ ఆడియన్స్ ను చాలా బాగా అట్రాక్ట్ చేస్తాయి. ప్రేక్షకులందరికీ దగ్గరయ్యే సింపుల్ కథలు, ఫన్నీ సీన్స్, ఎమోషనల్ టచ్ ఇవ్వడం వల్ల ఆయన సినిమాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. అందుకే ఆయన చిత్రాలు థియేటర్‌లో చూసినా, టీవీలో చూసినా ఒకే రకమైన వినోదాన్ని అందిస్తాయని ప్రేక్షకులు భావిస్తారు. అనిల్ రావిపూడి సినిమాలు కేవలం థియేటర్, ఓటీటీ, టెలివిజన్ మూడు ప్లాట్‌ఫారమ్‌లలోనూ గ్రాండ్ సక్సెస్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే.. అనిల్ రావిపూడి తదుపరి ప్రాజెక్ట్‌పై కూడా ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ లతో మాల్టీ స్టారర్ మూవీని తెరకెక్కించాలని భావిస్తున్నారు. ఈ సినిమాను 2027 సంక్రాంతికి విడుదల చేయాలని ఫ్లాన్ చేస్తున్నారంట. ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి భవిష్యత్తులో ఇంకా ఎలాంటి రికార్డులు సృష్టిస్తారో అనే ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











