బాలయ్య కొత్త సినిమా.. సుప్రీం డైరెక్టర్ ఖాయమేనా!
ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని జనరంజకంగా మలిచే ప్రయత్నాల్లో బాలయ్య ఉన్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంతో బాలయ్య పూర్తి బిజీగా మారిపోయాడు. క్రిష్ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇదిలా ఉండగా బాలయ్య తదుపరి చిత్రంపై వార్తలు మొదలయ్యాయి. బాలయ్యతో సినిమా చేయాలనుకుంటున్న దర్శకులు ఒక్కొక్కరుగా వెలుగులోకి వస్తున్నారు.
బోయపాటితో బాలయ్య మూడవ చిత్రం ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజగా సుప్రీం డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా లైన్ లోకి వచ్చాడు. అనిల్ రావిపూడి ఎప్పటినుంచో బాలయ్యతో సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. బాలయ్య కోసం పూర్తి స్థాయి వినోదాత్మక అంశాలతో ఓ కథని కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

త్వరలోనే అనిల్ రావిపూడి బాలయ్యని కలసి కథ వివరించేందుకు రంగం సిద్ధం అయినట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడి ఇప్పటికే నందమూరి కళ్యాణ్ రామ్ తో పటాస్ చిత్రాన్ని తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నాడు. బాలయ్యతో సినిమా ఒకే అయితే నందమూరి అభిమానుల్లో అంచనాలు పెరగడం ఖాయం.


Click it and Unblock the Notifications











