సరిలేరు యాభై రోజులు.. అది గౌరవంగా ఫీల్ అవుతా.. డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్
సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి సీజన్‌లో విన్నర్‌గా నిలిచింది. మాస్ పల్స్ తెలిసిన దర్శకుడిగా, హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో అనిల్ రావిపూడి ప్రత్యేకతను మరోసారి చాటుకున్నాడు. మహేష్ బాబు ఫ్యాన్స్‌కు ట్రీట్‌లా అనిపించేట్టు సరిలేరును తెరకెక్కించాడు. మహేష్ బాబు మాస్ ఫాలోయింగ్ దెబ్బకు బాక్సాఫీస్ షేక్ అయింది.
వంద కోట్ల షేర్..
సరిలేరు చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వంద కోట్లకు పైగా షేర్ రాబట్టి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. అక్కడ సరిలేరు 2.5 మిలియన్ డాలర్లను కొల్లగొట్టింది. ఈ చిత్రం విడుదలై నేటికి యాభై రోజులు అవుతుండటంతో డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ చేశాడు.

మరో మరిచిపోలేని సంక్రాంతి..
‘మరో మరిచిపోలేని సంక్రాంతి.. ఎప్పటికీ మరిపోలేని ప్రయాణం.. యాభై రోజులు పూర్తి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది.. సరిలేరు నీకెవ్వరు అనేది నాకు ఎంతో ప్రత్యేకం.. టేకే బౌ.. నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్.. అర్థమవుతోందా.. రమణా లోడ్ ఎత్తాలిరా.. వంటి ఎన్నో డైలాగ్స్ తెలుగు రాష్ట్రాల్లో మార్మోగాయి. మనస్ఫూర్తితో కూడిన మీ నవ్వులే బాక్సాఫీస్ వద్ద కలెక్ష సునామిని సృష్టించాయి.
పెట్టిన ప్రతీ రూపాయి..
బాధైనా గాయమైనా తట్టుకునే శక్తి ఆడవాళ్లకు మాత్రమే ఉంది.. అందుకేనేమో దేశాన్ని అమ్మతో పోల్చుతారు.. ఇలాంటి ఆలోచనలు రేకెత్తించే ఎన్నో మాటలను మీరు ప్రశంసించారు. మీరంతా ఈ చిత్రాన్ని కేవలం ఐదు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయ్యేలా చేశారు. డిస్ట్రిబ్యూటర్స్ పెట్టిన ప్రతీ రూపాయికి మరో రూపాయి వచ్చేలా చేశారు. నిర్మాతకు లాభాలు వచ్చేలా.. నా మీద మా హీరో పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేశారు. మీరంతా మరిచిపోలేని సంక్రాంతిని ఇచ్చారు.. ప్రేక్షకులూ.. సరిలేరు మీకెవ్వరూ.. ' అంటూ పోస్ట్ చేశాడు.

అది గౌరవంగా ఫీలవుతున్నాను..
‘మీతో కలిసి పని చేయడం ఓ అందమైన అనుభూతి. చాలా కాలం తరువాత మిమ్మల్నీ నా చిత్రంతో రీఎంట్రీ వచ్చేలా చేయడం గౌరవంగా ఫీల్ అవుతున్నాను. క్లాస్ అనేది ఎప్పటికీ శాశ్వతమేనని మీ నటనతో మరో సారి నిరూపించార'ని విజయశాంతి గురించి ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











