twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిన్ను చూసి ఆడజాతి గర్వపడుతుంది.. యువ డైరెక్టర్‌పై అనిల్ రావిపూడి ఫన్నీ కామెంట్స్

    |

    యువ హీరో నాగశౌర్య నటించిన కృష్ణ వ్రింద విహారి చిత్రం సెప్టెంబర్ 23న రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ వ్రింద విహారి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా యూనిట్‌లో అందరితో మంచి సాన్నిహిత్యం ఉంది. డైరెక్టర్ అనీష్‌లో నచ్చే గుణం.. ఎప్పుడు నవ్వుతూనే ఉండటం. ఎలాంటి పరిస్థితుల్లో కూడా నవ్వుతూనే ఉంటాడు. మంచి సక్సెస్ కొట్టాలని కోరుకొంటున్నాను. నిన్ను చూసి ఆడజాతి గర్వపడుతుంది. హీరోయిన్ జట్టు కంటే నీ జుట్టే పొడుగు ఉంది అని చమత్కరించారు. ఇంకా అనిల్ రావిపూడి మాట్లాడుతూ..

    Anil Ravipudi

    నిర్మాత ఉషా గారితో నాకు మంచి రిలేషన్ ఉంది. ఈ ప్రొడక్షన్ హౌస్ ఇంటి తరహా సంస్థ. ఈ యూనిట్‌లో పనిచేసిన వారందరూ వారి ఆతిథ్యం గురించి గొప్పగా చెప్పుకొంటారు. అంత మంచిగా ప్రతీ ఒక్కరిని నిర్మాతలు చూసుకొంటారు అని అనిల్ రావిపూడి అన్నారు.

    నాగశౌర్య గురించి చెప్పాలంటే.. మోస్ట్ హార్డ్ వర్కింగ్ హీరో. హిట్లు కొడుతూ ప్రతీ సినిమాకు విభిన్నంగా కంటెంట్ ఎంచుకొంటూ వస్తున్నారు. ఛలో సినిమా నుంచి హిట్లు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి కథలే చేస్తూ మంచి హిట్లు సాధించాలి. కృష్ణ వ్రింద విహారి నీ కెరీర్‌లోనే పెద్ద హిట్ అవుతుంది అని అనిల్ రావిపూడి జోస్యం చెప్పారు.

    కృష్ణ వ్రింద విహారి ప్రమోషన్స్ కూడా భారీగా, వినూత్నంగా చేశారు. ఈ సినిమా కోసం నాగశౌర్య పాద యాత్ర చేసి..మూవీపై అంచనాలు పెంచారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో కీలకంగా మారిన పీఆర్వో వంశీ, శేఖర్‌కు ధన్యవాదాలు. ఈ సినిమా కోసం సాగర్ మంచి పాటలు ఇచ్చారు. పాటలు బాగుంటే.. సినిమా సగం హిట్ అయినట్టే. సాగర్‌కు నా థ్యాంక్స్ అని అన్నారు.

    English summary
    Tollywood director Anil Ravipudi funny Speech at Krishna Vrinda Vihari Pre Release Event. After this, Hero Naga Shaurya gets Emotional Krishna Vrinda Vihari Pre Release Event. He made speech about problem of movie making, He compared farmers with producers. యువ హీరో నాగశౌర్య నటించిన కృష్ణ వ్రింద విహారి చిత్రం సెప్టెంబర్ 23న రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X