MSVPG Pre Release Event: నా చుట్టూ ఎన్నో జరిగాయి... చిరంజీవిగారు లేకుంటే.. అనిల్ రావిపూడి షాకింగ్‌గా

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్‌గా నటించగా.. విక్టరీ వెంకటేష్ కీలకపాత్ర పోషించారు. కేథరిన్ థ్రెసా, మాస్టర్ రేవంత్, బేబీ ఐరా, హర్షవర్థన్‌లు తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సాహు గారపాటితో కలిసి చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకత్వం వహిస్తున్నారు, తమ్మిరాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

సంక్రాంతి కానుకగా జనవరి 12న మన శంకర వరప్రసాద్ గారు మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. దీనిలో భాగంగా జనవరి 7వ తేదీన హైదరాబాద్ శిల్పకళా వేదికలో మన శంకర వరప్రసాద్ గారు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ... మన శంకర వరప్రసాద్ గారు చిత్రానికి ముగ్గురు మూలస్తంభాలుగా నిలిచారు. వారిలో ముందు నయనతార గురించి చెప్పాలి. రెండు నెలలు సమ్మె జరిగి షూటింగ్ డీలే అయినా తర్వాత నెలన్నర రోజులు కంటిన్యూస్‌గా డేట్స్ ఇచ్చి తను హైదరాబాద్‌లో పిల్లలతో పాటు స్టే చేసి చాలా సపోర్ట్ చేశారు. అంతేకాకుండా ఆవిడ మనకోసం రెండు ప్రమోషన్స్ చేసింది. తను ఈరోజు అబ్రాడ్‌లో ఉండిపోయింది.. ఇండియాలో ఉండి ఉంటే ఈవెంట్‌కి కూడా ఖచ్చితంగా నయనతారని తీసుకొచ్చేవాడిని అని అనిల్ రావిపూడి తెలిపారు.

Anil Ravipudi Hails Chiranjeevi Nayanthara and Venkatesh as the Pillars of Mana Shankara Varaprasad Garu at Pre-Release Event

విక్టరీ వెంకటేష్ గారు ఫ్రెండ్ గైడ్‌కి మించి. టెక్నికల్‌గా చెప్పాలంటే వెంకీ గారితో ఇది నాలుగో సినిమా. ఆయనతో నాకున్న సింక్ గానీ.. ఆయనతో నాకున్న ఫ్రెండ్‌షిప్ కానీ, వెంకీగారిలో ఉన్న గొప్పతనం స్పోర్టివ్‌నెస్. ఇందాక చిరంజీవిగారి పాటకి ఇద్దరం కలిసి ఎనర్జీతో డ్యాన్స్ చేశాం. అలా వెంకటేష్ గారిలా ఎవ్వరూ చేయలేరు. పాజిటివిటీకి సిగ్నల్ పెడితే 100జీ మీ చుట్టూనే ఉంటుంది. వెంకీ సార్ పాత్ర గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే వెంకీగారు ఈ సినిమాలోకి రావడానికి ప్రధాన కారణం చిరంజీవిగారు. నేను కథ చెప్పాక.. ఈ కథలో ఇలాంటిది ఏదైనా ఉంటే ఆలోచించమని చిన్న బాంబు వదిలారు. దానిని మేమంతా కష్టపడి ఒక బ్లాస్ట్‌లా చేయగలిగాం. వెంకీగారు ఈ సినిమాలో వెంకీ గౌడ ఫ్రమ్ కర్ణాటక అని అనిల్ రావిపూడి తెలిపారు.

చిరంజీవి గారు లేకపోతే ఈ కాంబినేషన్ సెట్ అయ్యేది కాదు. చిరంజీవిగారిని, వెంకటేష్‌ గారిని కలిపి చూడాలన్నది ఎంతోమంది ఎన్నో ఏళ్ల డ్రీమ్. అది నాకు కుదిరింది.. నా అదృష్టం. వాళ్లిద్దరూ ఈ డెసిషన్ తీసుకోవడం వెనుక ఒక మోటో ఉంది. తెలుగు ప్రేక్షకులందరికీ ఒక కన్నుల విందు ఇవ్వాలని వాళ్లిద్దరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు. వాళ్లద్దరి సీన్స్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు, వారిద్దరి కలయిక తెలుగు సినిమా హిస్టరీలో మెమెరబుల్‌గా మిగిలిపోతుంది. ఇది చిన్న పార్టే కావొచ్చు .. కానీ ఫ్యూచర్‌లో ఫుల్ లెంగ్త్ ఏమైనా ఛాన్స్ ఉంటుందా? అని రిక్వెస్ట్ చేస్తున్నానని అనిల్ అన్నారు.

చిరంజీవిగారు 150కి పైగా సినిమాలు చేశారు, కేంద్రమంత్రిగా పనిచేశారు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ఎక్కారు, పద్మభూషణ్, పద్మవిభూషణ్. ఒక మనిషి ఎన్ని సాధించాలో అన్ని పీక్స్ సాధించిన మనిషి.. కానీ చాలా సింపుల్‌గా, పాజిటివ్‌గా ఉంటారు. మీతో గడిపిన ఈ ఆరు నెలలు నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. ఆ 6 నెలల ప్రయాణంలో ప్రతిరోజూ సెట్‌లో ఒక ఖైదీతో గడిపా, ఒక యముడికి మొగుడితో గడిపాను, ఒక దొంగ మొగుడితో గడిపాను, ఒక అత్తకు యముడు అమ్మాయి మొగుడితో, ఒక రౌడీ అల్లుడితో టైం స్పెండ్ చేశాను. ప్రతిరోజూ ఆయన పక్కన కూర్చొని ఒక చిన్నపిల్లాడిలా ఆ సీన్ ఎలా చేశారు? ఈ సీన్ ఎలా చేశారని అడిగేవాడిని. ఆయన అనుభవాలన్నీ కలిపి ఒక అవకాయ ముద్ధలా మాకు అందించారని అనిల్ తెలిపారు.

ఈ సినిమా 6 నెలల ప్రయాణం తర్వాత లాస్ట్ వర్కింగ్ డే రోజున చిరంజీవి గారిని చూస్తూ నన్ను ఆయన హగ్ చేసుకున్న సందర్భాన్ని లైఫ్‌లో మరిచిపోలేను. హీరోగా నమ్మి నాకు అవకాశం ఇచ్చినందుకు ఆయన హ్యాపీ.. ఒక డైరెక్టర్‌గా ఒక లెజెండ్రీ హీరోతో పనిచేసినందుకు నేను హ్యాపీగా ఫీలయ్యాను. ఈ సినిమా కథ చెప్పాక.. ఆయన ఒరిజినల్ నేమ్‌తో క్యారెక్టర్ పెట్టి ఎంత అల్లరి చేయాలో, ఎంత గోల చేసేశారు. ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషనల్ డ్రామా కూడా ఉంది. వెంకటేష్ గారి ఎంట్రీతో అద్భుతమైన అల్లరి.. కంప్లీట్ ప్యాకేజ్ బాగా కుదిరింది అని అనిల్ తెలిపారు.

నాలుగో సంక్రాంతికి మీ ముందుకు వస్తున్నాను. నా చుట్టూ ఎంత జరిగినా నేను ధైర్యంగా ముందుకు వెళ్తున్నానంటే దానికి కారణం ప్రేక్షకులే. ప్రతి సినిమాని ఎక్కడో నిలబెడుతున్నారు. ఫ్యామిలీ జోనర్స్‌కి ఇంత స్ట్రెంత్ ఉందని ప్రూవ్ చేసిన తెలుగు ప్రేక్షకులకు పాదాభివందనలు. ఖచ్చితంగా 2026 సంక్రాంతి... చిరంజీవిగారి కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన విజయాలు చూశాం. వాటిలో నా సినిమా కూడా నిలవాలని కోరుకుంటున్నా. ఈ సినిమాకు రాబోతున్న అన్ని సినిమాలకు నా బెస్ట్ విషెస్. ముఖ్యంగా డార్లింగ్ ప్రభాస్ గారికి రాజాసాబ్‌కి. మై డియర్ మాస్ మహారాజ్ రవితేజ గారికి, నవీన్, శర్వానంద్ గారికి కూడా నా బెస్ట్ విషెస్. మన శంకర వరప్రసాద్ గారిని ఆదరించండి అని అనిల్ రావిపూడి ముగించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X