Remuneration: సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్.. అనిల్ రావిపూడి షాకింగ్ రెమ్యునరేషన్.. రికార్డు లెవెల్‌లో!

ఏ సినీ పరిశ్రమలో అయినా కూడా ఒక హీరో లేదా దర్శకుడు తమ హిట్ స్ట్రీక్ ని అలా మైంటైన్ చేస్తూ వెళ్లడం అనేది దాదాపు అసాధ్యమే అని చెప్పవచ్చు. కానీ వరుసగా చేస్తున్న సినిమాలు హిట్ అయితే మాత్రం అంతకు మించిన అదృష్టం ఇంకొకటి ఉండదు. కాగా మన తెలుగు నుంచి వరుస బ్లాక్ బస్టర్స్ అనే మాట వస్తే ఖచ్చితంగా వినిపించే పేరు ఏదన్నా ఉంది అంటే అది దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి పేరే అని చెప్పవచ్చు.

కెరీర్ స్టార్ట్ చేసిన ఇన్నేళ్ళలో ఒక్క ప్లాప్ కూడా లేని దర్శకునిగా దర్శకుడు రాజమౌళి పేరు అలా వైరల్ గా మారింది. ఇక తాను కాకుండా మన తెలుగు నుంచి ఉన్న మరో హిట్ మెషీన్ దర్శకుడు ఎవరు అంటే అది ఫుల్ స్వింగ్ లో ఉన్న అనీల్ రావిపూడి అని చెప్పాలి. కాగా అనీల్ రావిపూడి కూడా తన మొదటి సినిమా పటాస్ నుంచి ఇప్పుడు వరకు ఓటమి అనేది ఎరుగలేదు.

anil ravipudi hikes huge remuneration for his next project

వరుస భారీ హిట్స్ తో ఇపుడు తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ కం భారీ ప్రాఫిట్స్ అందించిన దర్శకునిగా నిర్మాతలకి రియల్ హీరో అయ్యాడు. దీనితో అనీల్ రావిపూడిపై బెట్టింగ్ వేసేందుకు నిర్మాతలు కూడా మొగ్గు చూపుతున్నారు. మరి ఈ నేపథ్యంలోనే అనీల్ రావిపూడి కూడా భారీ లెవెల్లో తన రెమ్యునరేషన్ ని పెంచినట్టుగా తెలుస్తుంది.

కాగా ఇపుడు తాను చేసిన హిట్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం ఏ రేంజ్ లో సెన్సేషన్ ని నమోదు చేస్తుందో అంతా చూస్తున్నారు. మరి ఈ సినిమా హిట్ తో తాను ఏకంగా 10 కోట్లు తన రేటు పెంచినట్టుగా సినీ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సంక్రాంతికి వస్తున్నాంకి తాను సుమారు 15 కోట్లు ఛార్జ్ చేసినట్టుగా టాక్. కానీ ఇపుడు నెక్స్ట్ సినిమాకి ఏకంగా 25 కోట్లుకి తన పారితోషికం పెంచినట్టుగా ఇపుడు రూమర్స్ వినిపిస్తున్నాయి.

దీనితో అనీల్ రావిపూడి తాలూకా గ్రాఫ్ ఏ లెవెల్లో ఎగబాకిందో అర్ధం చేసుకోవచ్చు. దీనితో ప్రస్తుతం అనీల్ రావిపూడి డిమాండ్ నడుస్తుంది అన్నట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాము అయితే మన సీనియర్ హీరోస్ లో 300 కోట్ల కోట్ల మార్క్ అందుకునే దిశగా వెళుతుండగా ఈ సినిమా తర్వాత అనీల్ రావిపూడి నుంచి సంక్రాంతికి వస్తున్నాం 2 అలాగే తన బిగ్ హిట్ సిరీస్ ఎఫ్ 4 సిరీస్ కూడా కొనసాగనుంది.

అలాగే వీటి అన్నిటినీ మించిన భారీ ప్రాజెక్ట్ మెగాస్టార్ చిరంజీవితో తన నుంచి రానుంది. ప్రస్తుతం చర్చల్లో ఉన్న ఈ సినిమా లైన్ వరకు ఓకే అయ్యింది. ఈ సినిమాని చిరు మార్క్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేస్తున్నట్టు తాను తెలిపారు. మరి ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ ని నమోదు చేస్తుందో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X