Don't Miss!
- Technology 6.9 అంగుళాల డిస్ప్లే, 64MP కెమెరా ఫోల్డబుల్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. అమెజాన్ సేల్ పూర్తి వివరాలు..!
- News అనుభవజ్ఞుడైన నాయకుడు చంద్రబాబు: ప్రధాని మోదీ కితాబు.. సెలబ్రేషన్స్ ఇలా
- Finance API: ఫార్మా కంపెనీలకు శుభవార్త.. ఇక లాభాలే..!
- Sports ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
ఎట్టకేలకు డ్రీమ్ హీరోతో అనిల్ రావిపూడి మూవీ.. హై వోల్టేజ్ కాంబో!
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ దర్శకులు చాలా కాలం తరువాత ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో రెండు మూడు ప్రాజెక్టులను ఎనౌన్స్ చేసేస్తున్నారు. కరోనా దెబ్బ కొట్టడం వలన ఇండస్ట్రీ మళ్ళీ ట్రాక్ లోకి రావాలి అంటే బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు పడాల్సిందే. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి కూడా అదే స్పీడ్ తో వెళుతున్నాడు. పలుమార్లు ఒక అగ్ర హీరో రిజెక్ట్ చేసినప్పటికీ మళ్ళీ అతని దగ్గరకే వెళ్లి ఓకే చేయించాడు.
ఆ సినిమా మధ్యలో నుంచే..
దర్శకుడు అనిల్ రావిపూడి మొదటి సినిమా పటాస్ బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా కంటే ముందు కొన్ని పెద్ద సినిమాలకు అనిల్ రైటర్ గా వర్క్ చేశారు. ముఖ్యంగా శ్రీనువైట్లతో కూడా అతనికి మాంచి బాండింగ్ ఉండేది. పటాస్ ఛాన్స్ రావడంతో ఆగడు సినిమా షూటింగ్ మధ్యలో నుంచే డ్రాప్ అయ్యాడు.
అందుకే బాలయ్య ఒప్పుకోలేదు
నిజానికి అనిల్ రావిపూడి మొదట రాసుకున్న కథ రామారావు గారు. పటాస్ కంటే ముందే బాలకృష్ణతో సినిమా చేయాలని టార్గెట్ కూడా సెట్ చేసుకున్నాడు. కానీ బాలయ్య అప్పుడు వేరే కమిట్మెంట్స్ వల్ల ఒప్పుకోలేదు. అలాగే బయోపిక్ తీసే ఆలోచనలో ఉండడం వల్ల నాన్నగారి టైటిల్ వాడకూడదని అనుకున్నాడు.
మోక్షజ్ఞతో అనుకున్నప్పటికి..
ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి వరుసగా బాక్సాఫీస్ హిట్స్ అందుకోవడంతో అగ్ర హీరోలు అతనికి పిలిచి మరీ అవకాశాలు ఇవ్వాలని అనుకుంటున్నారు. బాలకృష్ణ కూడా అనిల్ తో పలుమార్లు చర్చలు జరిపారు. కమర్షియల్ గా కాన్ఫిడెంట్ గా సినిమాలు చేస్తున్నాడు కాబట్టి మోక్షజ్ఞను అతని చేతుల్లోనే పెట్టవచ్చని ఆ మధ్య టాక్ కూడా వచ్చింది. కానీ ఇంకా బాలయ్య తనయుడు ఎంట్రీకి సిద్ధంగా లేకపోవడంతో ప్లాన్ క్యాన్సిల్ అయ్యింది.
2022లో బాలయ్యతో..
అయితే అనిల్ చాలా ఇంటర్వ్యూలలో బాలకృష్ణతో ఒక సినిమా చేయాలన్నది తన డ్రీమ్ అని చెప్పాడు. ఇక మొత్తానికి ఆ కల నెరవేరుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కథ విన్న బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక సినిమా 2022మొదట్లోనే రావచ్చని సమాచారం. ప్రస్తుతం బాలయ్య బోయపాటి అఖండ సినిమాకు ఫీనిషింగ్ టచ్ ఇస్తున్న విషయం తెలిసిందే.