The Rajasaab: ‘ది రాజాసాబ్' రిజల్ట్‌పై అనిల్ రావిపూడి రియాక్షన్ ఇదే..

టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ సంక్రాంతికి భారీ అంచనాల మధ్య మన శంకర వర ప్రసాద్ (Mana Shankara Vara Prasad Garu) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తుండగా, లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్‌గా కనిపించనున్నారు.

ఇక క్లైమాక్స్‌లో విక్టరీ స్టార్ వెంకటేష్ స్పెషల్ అపియరెన్స్ ఇవ్వడం సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. ఇలాంటి సందర్భంలో అనిల్ రావిపూడి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ ది రాజాసాబ్ (The Rajasaab) మూవీపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏమన్నారంటే?

Anil Ravipudi Reacts to The Rajasaab Talk

'ది రాజాసాబ్' టాక్‌పై అనిల్ రావిపూడి స్పందన
సంక్రాంతి సినిమాల్లో 'ది రాజాసాబ్'కి నెగిటివ్ టాక్ వచ్చిందన్న ప్రశ్నకు అనిల్ రావిపూడి స్పందిస్తూ... 'ఆ సినిమా నేను ఇంకా చూడలేదు. డైరెక్టర్ మారుతి నాకు మంచి స్నేహితుడు. ఈ రోజుల్లో ఏ సినిమాకైనా మిక్స్డ్ టాక్ రావడం కామన్. బెస్ట్ టాక్ ఏంటో ప్రేక్షకులే డిసైడ్ చేస్తారు. మూడు నాలుగు రోజుల్లో అసలు టాక్ ఎలా ఉంటుందో, సినిమా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో తెలుస్తుంది' అని క్లారిటీ ఇచ్చారు. పెద్ద హీరోల సినిమాలు, సంక్రాంతి సినిమాలు అన్న తేడా లేకుండా రెవెన్యూ పరంగా కలెక్షన్స్ బాగానే వస్తాయని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.

ఓటిటి సంస్థల ప్రభావంపై షాకింగ్ కామెంట్స్
సినిమా విడుదల తేదీలను ఓటిటి ప్లాట్‌ఫాంలు డిసైడ్ చేస్తున్నాయా? అనే ప్రశ్నకు అనిల్ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఈ సంప్రదాయాన్ని అలవాటు చేసింది మన ప్రొడ్యూసర్లే. కరోనా సమయంలో సినిమాలను థియేటర్లలో కాకుండా ఓటిటిల్లో రిలీజ్ చేయడం వల్ల ప్రేక్షకులను మనమే దారి మళ్లించాం. దాని ఫలితంగా థియేటర్ బిజినెస్ కూడా ఓటిటి సంస్థల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు షరతులు వాళ్లే పెడుతున్నారు, విడుదల తేదీలు కూడా వాళ్లే ఫిక్స్ చేస్తున్నారు' అని తెలిపారు.

ఇక ఈ సంక్రాంతికి విడుదలవుతున్న రెండు మూడు సినిమాలు కూడా ఓటిటి ప్రెజర్ వల్లే బరిలో నిలిచాయని, గతంలో ఇచ్చినంత భారీ ప్రైసెస్ ఇప్పుడు ఓటిటి సంస్థలు చెల్లించడం లేదని చెప్పారు.'ముందు ఎక్కువ రేట్లు ఇచ్చారు, ఇప్పుడు అవి క్రమంగా తగ్గిపోయాయి. ప్రస్తుతం పరిశ్రమ మొత్తం ఒకరకమైన క్రైసిస్‌లోనే ఉంది' అంటూ పరిస్థితిని వివరించారు.

మన శంకర వర ప్రసాద్ గారు- ఓటిటి డీల్‌పై క్లారిటీ
'మన శంకర వర ప్రసాద్ గారు' ఓటిటి డీల్ ముందుగానే క్లోజ్ అయ్యిందా? అనుకున్నంత రేటు వచ్చిందా? అనే ప్రశ్నకు... 'అవును. మేము అనుకున్న రేంజ్‌లోనే బిజినెస్ జరిగింది. ముందే జరిగి ఉంటే ఇంకా పెద్ద నెంబర్ వచ్చేది. ఇప్పటి క్రైసిస్‌లో కూడా డీసెంట్ నెంబర్ సాధించాం' అని వెల్లడించారు.

హీరోల రెమ్యునరేషన్ అంశంపై స్పందిస్తూ... 'ఇది పూర్తిగా ఇండివిజువల్ డెసిషన్. నేనొక్కడినే మాట్లాడితే ఏమీ మారదు. సినిమా బడ్జెట్, థియేటర్ బిజినెస్‌ను బట్టి పారితోషకం డిసైడ్ చేసుకుంటే బెటర్' అని అభిప్రాయపడ్డారు. మొత్తానికి 'ది రాజాసాబ్' టాక్ నుంచి ఓటిటి ప్రభావం వరకూ, పరిశ్రమలో జరుగుతున్న మార్పులపై అనిల్ రావిపూడి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X