జీవీ ప్రకాష్‌‌‌కు అనిల్ రావిపూడి పనిష్మెంట్... జంధ్యాల కాన్సెప్ట్‌తో పిండేశాడుగా..

మెగాస్టార్ చిరంజీవితో ఈ ఏడాది సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారితో మూవీతో తిరుగులేని హిట్ అందుకున్నారు హిట్ మెషిన్ అనిల్ రావిపూడి. తద్వారా టాలీవుడ్‌లో అపజయం లేని డైరెక్టర్ల లిస్ట్‌లో స్థానం సంపాదించాడు. మన శంకర వరప్రసాద్ గారుతో హిట్ తర్వాత అనిల్ రావిపూడి ఎవరితో సినిమా చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. విక్టరీ వెంకటేష్, నాగార్జున తదితర హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే చివరికి మరోసారి వెంకటేష్‌తోనే సినిమా చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు అనిల్. ఇందులో నందమూరి కళ్యాణ్ రామ్ కూడా మరో హీరోగా నటిస్తున్నారని ప్రకటించి సర్‌ప్రైజ్ చేశారు.

షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహూ గారపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వెంకటేష్‌తో అనిల్ రావిపూడి జతకట్టడం ఇది ఐదోసారి. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే ఎఫ్ 2, ఎఫ్ 3, సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ గారు సినిమాలొచ్చి ఘన విజయాలు సాధించాయి. ఇప్పుడు మరోసారి తనకు లక్కీగా మారిన సంక్రాంతికే ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు అనిల్. జూలై మొదటి వారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందని టాక్. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన మహానటి కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్ సరసన కృతిశెట్టి హీరోయిన్లుగా ఎంపికైనట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి.

Anil Ravipudi s fun wiith GV Prakash Kumar video goes viral Ahead of Venkatesh Kalyan Ram Multistarrer

తన కామెడీ, పంచ్‌లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే అనిల్ రావిపూడిలో ఉన్న మరో ప్రత్యేకత వెరైటీ ప్రమోషన్స్. కెరీర్ స్టార్టింగ్ నుంచి నేటి వరకు తన సినిమాల ప్రారంభానికి ముందు, ఆ తర్వాత విభిన్నంగా ప్రమోషనల్ కార్యక్రమాలు చేపట్టి తన సినిమాపై హైప్ తీసుకురావడంలో ఆయనది అందె వేసిన చేయి. సంక్రాంతికి వస్తున్నాం మూవీకి రమణ గోగులని దించి ఆయనతో పాట పాడించి.. ఆ పాటతోనే బజ్ తీసుకొచ్చారు అనిల్ రావిపూడి. అంతేకాదు.. సినిమా విడుదల తర్వాత వెంకటేష్ సహా హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలతో విభిన్నంగా ఇంటర్వ్యూలు చేయించారు.

ఇక మన శంకర వరప్రసాద్ గారిది మరో కథ. తన సినిమాల ప్రమోషన్స్‌కి ఎప్పుడూ రాని లేడీ సూపర్‌స్టార్‌ నయనతారతో ఈ మూవీ ప్రారంభానికి ముందే ఓ వీడియో చేయించి చిత్ర పరిశ్రమకు షాకిచ్చిన అనిల్.. చివరిలోనూ ఆమెతో ఓ సర్‌ప్రైజ్ వీడియోతో అభిమానులను అలరించారు. ఇప్పుడు తాజాగా వెంకటేష్ - కళ్యాణ్ రామ్ మూవీ కోసం కూడా వెరైటీగా ప్లాన్ చేశారు. తన సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్స్‌ని మార్చడం అనిల్‌కు అలవాటుగా కెరీర్ స్టార్టింగ్‌లో సాయి కార్తీక్‌తో వర్క్ చేసిన ఆయన ఆ తర్వాత దేవిశ్రీ ప్రసాద్, తమన్‌లకు అవకాశాలిచ్చారు. అయితే సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ గారు సినిమాలకు భీమ్స్ సిసిరోలియోలతో పనిచేశారు.

ఇప్పుడు వెంకటేష్ - కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్‌కు కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్‌ను దించాడు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు అనిల్ రావిపూడి. దీనిని తన సినిమాకు ప్రమోషన్ కోసం వాడుకున్నాడు. లెజెండరీ డైరెక్టర్, హాస్య బ్రహ్మ జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన వివాహా భోజనంబు మూవీలో బ్రహ్మానందం- సుత్తి వీరభద్రరావు కాంబలో వచ్చిన ఐకానిక్ సీన్‌కు స్పూఫ్‌గా ఈ వీడియోను వదిలాడు అనిల్.

ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ వణక్కం అంటూ ఆయనని బీచ్‌లోని ఇసుకలో పాతిపెట్టాడు అనిల్. మన సినిమాలో పాటలు ఎలా ఉండాలంటే క్లాసు పాట.. మాసు పాట.. ఎమోషనల్ పాట.. మెలోడీ పాట.. వీల్‌చైర్ పాట.. బీజీఎం పాట అంటూ ఇంకేదో పాట ఉండాలని అడుగుతాడు అనిల్. దానికి జీవీ ప్రకాష్ బదులిస్తూ.. ఆస్కార్ పాట.. గ్రామీ పాట అంటాడు. మ్యూజిక్ సిట్టింగ్ అని పిలిచి ఈ ఫిట్టింగ్ ఏంటీ మహాప్రభో అని జీవి అడుగుతాడు. నువ్వు హీరోగా బిజీ, మ్యూజిక్ డైరెక్టర్‌గా బిజీ, ప్రొడ్యూసర్‌గా బిజీ.. ఒక్క మనిషి ఇన్ని పనులు చేయొచ్చా. ఇంత బిజీగా ఉన్న నీతో మా ప్రొడ్యూసర్ కాళ్లు చేతులు కట్టేసి పని చేయించమన్నారు. నేనే కాస్త వెరైటీగా ఉంటుందని పాతిపెట్టేసి చేయిస్తున్నా అంటాడు అనిల్.

వెదర్ బాగుందయ్యా.. నీ కోసం హార్మోనియం కూడా రెడీ చేశా, మంచి ట్యూన్ కొట్టమని అడుగుతాడు అనిల్. ట్యూన్ కొట్టాలంటే హార్మోనియం ఒక్కటే ఉంటే సరిపోదు.. రెండు చేతులు, పది వేళ్లు కూడా కావాలని జీవీ ప్రకాష్ చిరాకు పడతాడు. అయితే ఓన్లీ నీ రెండు చేతుల్ని మాత్రం విడుదల చేస్తానని చెప్పి ట్యూన్ కొట్టిస్తాడు అనిల్ రావిపూడి. అయితే నాకొక లిరిక్ రైటర్‌ని ఇస్తే చాలా కంఫర్ట్‌గా ఉంటుందని చెబుతాడు జీవి ప్రకాష్. లిరిక్ రైటర్‌ ఎప్పుడో రెడీ, అతనిని పాతిపెట్టి రెండ్రోజులు అయ్యిందని చెప్పగా... ఇసుకలో అనంత్ శ్రీరామ్ ... మాస్ పాట, క్లాస్ పాట, అనిల్ గారు ఓకే చేసిన పాట అంటూ ఎంట్రీ ఇస్తాడు. ప్రస్తుతం ఈ వీడియో నవ్వులు పూయిస్తుండగా.. సినిమా ప్రమోషన్స్‌లో తనను కొట్టేవాడు లేడని అనిల్ రావిపూడి మరోసారి నిరూపించుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X