గతంలో హీరోలంతా ఎంతగానో నమ్మారు.. మహేష్ బాబు ఇప్పుడు మాత్రం: అనిల్ రావిపూడి
నన్ను నమ్మితే ప్రాణం పెట్టి పనిచేస్తా అంటున్నారు సరిలేరు నీకెవ్వరు డైరెక్టర్ అనిల్ రావిపూడి. పటాస్ సినిమాతో సినీ దర్శకుడిగా మొదలైన ఆయన ప్రయాణం సాఫీగా సాగుతూ ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సెట్స్ పై సాగుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన అన్ని అప్‌డేట్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుండటంతో ఆనందంగా ఉన్న అనిల్ రావిపూడి తాజాగా ఓ మీడియా సంస్థతో మాట్లాడారు.
2015లో దర్శకుడిగా తన మొదటి సినిమా 'పటాస్' విడుదలైందని.. అక్కడి నుంచి ఏడాదికో హిట్ ఇస్తూనే ఉన్నానని పేర్కొన్నారు అనిల్. తన నాలుగు సినిమాల జర్నీ చాలా బావుందని అన్నారు. తనను నమ్మితే ప్రాణం పెట్టి పనిచేస్తానని, ఇప్పటి వరకూ పనిచేసిన హీరోలంతా తనను ఎంతో నమ్మారని చెప్పారు. అందుకే తానూ ఈ స్థాయిలో ఉన్నానని.

ఇప్పుడు మహేశ్ కూడా తన పట్ల రెట్టింపు నమ్మకంతో ఉన్నారని అనిల్ చెప్పుకొచ్చారు. మహేష్ బాబుకు పెద్ద హిట్ ఇచ్చి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, మహేశ్‌తో పనిచేయడం బాధ్యతగా తప్ప భారంగా ఎక్కడా అనిపించలేదని ఈ సందర్బంగా ఆయన తెలిపారు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చిత్రంలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా.. లేడీ విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది. భారీ అంచనాల నడుమ జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











