For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    NBK108: టార్గెట్ సెట్ చేసిన అనిల్ రావిపూడి.. బాలయ్య ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్

    |

    టాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోల్లో నటసింహా నందమూరి బాలకృష్ణ ఒకరు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ ఇలా అన్ని రంగాల్లోనూ సందడి చేస్తూ హవాను చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలను కూడా ఆయన ఖాతాలో వేసుకున్నారు. అయితే, ఈ మధ్య కాలంలో చాలా ఏళ్ల పాటు సరైన హిట్ లేక ఇబ్బంది పడిన బాలయ్య.. గత ఏడాది వచ్చిన 'అఖండ' సినిమాతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నారు. ఈ ఉత్సాహంతోనే ఆయన ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నారు. ఇలా ఇప్పటికే గోపీచంద్ మలినేనితో తన 107వ సినిమాను దాదాపుగా పూర్తి చేసుకున్నారు.

    Mrunal Thakur: వ్యభిచార గృహంలో సీతా రామం హీరోయిన్.. రెండు నెలలు నరకం.. ఆ డైరెక్టర్ వల్లేనంటూ!

    'అఖండ' తర్వాత ఫుల్ స్పీడ్ పెంచేసిన నటసింహా నందమూరి బాలకృష్ణ.. టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడితో తన 108వ చిత్రాన్ని ప్రకటించారు. ఈ క్రేజీ కాంబినేషన్ కోసం నందమూరి అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు అనుగుణంగానే అప్పుడే అనిల్ రావిపూడి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టేశాడు. అంతేకాదు, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు వర్కును దర్శకుడు పూర్తి చేసుకున్నాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.

    Anil Ravipudi Set Target for Balakrishna Movie

    బాలయ్య - అనిల్ రావిపూడి కలయికలో రాబోతున్న ఈ సినిమాను నవంబర్ నుంచి ప్రారంభించబోతున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని కేవలం నాలుగు నెలల్లోనే పూర్తి చేసేలా దర్శకుడు ప్లాన్ చేసుకున్నాడట. అంటే నవంబర్‌లో రెగ్యూలర్ షూట్‌ను మొదలు పెడితే.. జనవరి పూర్తయ్యే సమయానికి టాకీ పార్టును కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాడట. అంతేకాదు, వచ్చే వేసవిలో ఈ సినిమాను విడుదల చేయాలని కూడా అనుకుంటున్నట్లు తెలిసింది. ఈ సినిమా విషయంలో మొత్తం అనుకున్నట్లు జరిగితే.. వచ్చే ఏడాది బాలయ్య రెండు సినిమాలతో వస్తారన్న మాట.

    ఒంటిపై నూలుపోగు లేకుండా హీరోయిన్: సీక్రెట్ పార్ట్ కనిపించేలా ఘోరంగా!

    క్రేజీ కాంబోలో రాబోయే ఈ సినిమాకు 'Bro I Don't Care' బ్రో ఐ డోంట్ కేర్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారని తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను సరికొత్త పంథాలో రూపొందించబోతున్నారట. ఇక, ఇందులో అంజలి, ప్రియమణి కీలక పాత్రలను చేస్తున్నారని అంటున్నారు. అలాగే, శ్రీలీలా.. బాలయ్య కూతురిగా నటించబోతుందని ప్రచారం జరుగుతోంది.

    English summary
    Nandamuri Balakrishna Will Do a Movie Under Anil Ravipudi Direction. Now The Director Anil Ravipudi Set Target for This Film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X