‘నువ్వు బజారోడివి కాదు.. నువ్వూ ఫ్యామిలీనే!': అనిల్ రావిపూడి షాకింగ్ కామెంట్స్
Anil Ravipudi: టాలీవుడ్‌లో కమర్షియల్ సక్సెస్‌కు కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారిన దర్శకుడు అనిల్ రావిపూడి.. మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మన శంకర వర ప్రసాద్ గారు అనే సినిమాతో ముందుకు వచ్చారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో అనిల్ రావిపూడి ప్రమోషన్స్‌లో దూకుడు పెంచారు. వరుస ఇంటర్వ్యూల్లో సినిమాపై హైప్ పెంచుతూనే, తనపై వస్తున్న ట్రోల్స్, మీమ్స్‌పై కూడా సరదాగా కానీ గట్టిగా స్పందించారు. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ తో నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి. ఇంతకీ ఏమన్నారంటే?
అనిల్ రావిపూడి సినిమాలంటే 'క్రింజ్ ఉంటుంది', 'కామెడీ యూత్‌కు కనెక్ట్ కాదు', 'ఫ్యామిలీకి మాత్రమే ఎక్కుతుంది' అనే తరహా ట్రోల్స్ చాలా కాలంగా వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సంక్రాంతి సినిమాల విషయంలో 'ఫ్యామిలీ ఆడియన్స్‌కి తప్ప యూత్‌కు నచ్చవు' అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఈ నేపథ్యంలోనే ఒక మీమ్ తెగ ట్రెండ్ అయ్యింది. ఆ మీమ్‌లో 'సంక్రాంతికి వస్తున్నాం యావరేజ్ గురూ'అంటే, 'అవును బావా... ఫ్యామిలీకి ఎక్కేస్తుంది' అని మరో వ్యక్తి చెప్పడం, వెంటనే 'అంటే నేను బజారోడినా?'అంటూ ఫైర్ అవడం.. ఈ డైలాగ్ సోషల్ మీడియాలో మీమ్ ఫీవర్‌గా మారింది. ఈ మీమ్‌ని చూసి తాను కూడా తెగ నవ్వుకున్నానని అనిల్ రావిపూడి స్వయంగా చెప్పారు.

'ఫ్యామిలీ అంటే యూత్ లేరా?' అనిల్ కౌంటర్
ఈ మీమ్‌పై అనిల్ రావిపూడి ఇచ్చిన క్లారిటీ ఇప్పుడు వైరల్ అవుతోంది. 'ఫ్యామిలీ జానర్ అంటే అందులో యంగ్‌స్టర్స్ కూడా ఉంటారు. నువ్వు మీ అమ్మానాన్నలతో కలిసి సినిమాకి వెళ్లి వాళ్లు ఎంజాయ్ చేస్తుంటే, ఆ ఫ్యామిలీలో నువ్వూ ఉన్నట్టే. అప్పుడు నువ్వు బజారోడివి ఎలా అవుతావు? నువ్వూ ఫ్యామిలీయే' అంటూ సరదాగా కానీ స్ట్రాంగ్ పాయింట్ చెప్పారు.
తన చిన్ననాటి అనుభవాలను గుర్తు చేసుకున్న అనిల్... 'చిన్నప్పుడు నేను 'అబ్బాయిగారు', 'సుందరకాండ', 'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు' లాంటి సినిమాలు నా పేరెంట్స్‌తో కలిసి థియేటర్‌లో చూశాను. అప్పట్లో నేను చిన్నోడిని, వాళ్లు పెద్దవాళ్లు. అయినా ఆ సినిమాలే నాకు ఇప్పటికీ నోస్టాల్జియాను ఇస్తున్నాయి' అన్నారు. అంటే... ఫ్యామిలీ సినిమా అంటే కేవలం పెద్దవాళ్ల కోసమే కాదు, తరతరాలకు మెమొరీస్ ఇచ్చే జానర్ అని అనిల్ స్పష్టంగా చెప్పారు.
అనిల్ మాట్లాడుతూ.. 'ఫ్యామిలీ సినిమాల్లో యూత్‌కు ఏమి ఉండదనుకోవడం తప్పు. 'సంక్రాంతికి వస్తున్నాం'లో మీనాక్షి చౌదరితో క్యూట్ లవ్ స్టోరీ ఉంది. యూత్‌కు అది నచ్చుతుంది. సీనియర్స్ ఉండటం వల్ల కొందరికి కథ కనెక్ట్ కాకపోవచ్చు, కానీ కామెడీని మాత్రం అందరూ ఎంజాయ్ చేస్తారు కదా' అని వివరించారు. 'ఏ జానర్ అయినా క్లీన్ మైండ్‌తో ఫ్యామిలీతో కలిసి సినిమా చూడండి. అమ్మానాన్నలకు నచ్చినవి వాళ్లు తీసుకుంటారు, మీకు నచ్చినవి మీరు తీసుకుంటారు. అలా మెమొరీస్ క్రియేట్ అవుతాయి'అని యూత్‌కు సలహా ఇచ్చారు అనిల్ రావిపూడి.
అనిల్ ట్రేడ్‌మార్క్ కామెడీ, చిరంజీవి మాస్ టైమింగ్, ఫ్యామిలీ ఎమోషన్ కలయికలో 'మన శంకర వరప్రసాద్ గారు' ఒక కంప్లీట్ సంక్రాంతి ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కినట్లు చిత్ర బృందం చెబుతోంది. క్లైమాక్స్‌లో విక్టరీ స్టార్ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. మొత్తానికి 'నువ్వు బజారోడివి కాదు.. నువ్వూ ఫ్యామిలీనే'అనే అనిల్ రావిపూడి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో మీమ్‌కు కౌంటర్‌గా, యూత్‌కు మెసేజ్‌గా మారాయి. ఫ్యామిలీ ఆడియన్స్ అంటే అందరూ అనే పాయింట్‌ను అనిల్ తనదైన స్టైల్‌లో మరోసారి స్టాంగ్ కౌంటర్ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











