దసరాకు బాలయ్య రచ్చ మామూలుగా ఉండదు.. ఇది శాంపిల్ మాత్రమే.. భగవంత్ కేసరి గురించి అనిల్ రావిపూడి
నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం భగవంత్ కేసరి. ఈ సినిమా దసరాకు రిలీజ్ అయ్యేందుకు ముస్తాబవుతున్నది. జూన్ 10వ తేదీ నందమూరి బాలకృష్ణ జన్మదినం కావడంతో ఆయన నటించిన భగవంత్ కేసరి సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లో భ్రమరాంబ థియేటర్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ..

అభిమానులందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా నటసింహ నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. బాలయ్య బర్త్ డే గిఫ్టు మీ అందరికి నచ్చి ఉంటుంది. టీజర్‌లో చెప్పినట్టే.. భగవంత్ కేసరి చాలా ఏండ్లు యాదికి ఉంటుంది. 1992లో రౌడీ ఇన్స్‌పెక్టర్ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాలో బాలయ్య బాబు హిందీ డైలాగ్‌లు చెబితే థియేటర్ దద్దరిల్లిపోయింది అని దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పారు.

భగవంత్ కేసరి మూవీ తెలంగాణ నేపథ్యం కావడంతో ఈ సినిమాలో హిందీ డైలాగ్స్ అక్కడక్కడా పెట్టాం. అందుకే సర్‌ప్రైజ్‌గా హిందీ డైలాగ్స్ వినిపించాం. ఈ సినిమాలో బాలయ్య బాబు ఎలా కనిపించబోతున్నారు. ఎలా ఉంటారో అనేది శాంపిల్ టచ్ ఇచ్చాం. ఈ సారి దసరాకు బాలయ్య బాబు మూములుగా ఎంటర్‌టైన్ చేయరు. అభిమానులతోపాటు తెలుగు సినిమాను అభిమానించే ప్రతీ ఒక్కరు ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు అని అనిల్ రావిపూడి తెలిపారు.

భగవంత్ కేసరి చిత్రం నా కెరీర్‌లో ఎక్కువగా గుర్తుండిపోయే చిత్రం అవుతుంది. బాలయ్య బాబు అద్బుతంగా ఫెర్ఫార్మ్ చేశారు. మా టీమ్ అందరికి నా థ్యాంక్స్. తమన్ ఈ రోజు రావాలి. కానీ ఇక్కడ లేకపోవడం రాలేకపోయారు. బాలయ్య సినిమా అంటే థమన్‌కు పూనకాలు వస్తాయి. ఈ సినిమా కోసం థమన్ బీజీఎం అద్బుతంగా చేస్తున్నారు. తిరుపతిలో ఉండటం వల్ల ఆయన రాలేకపోయారు. అయ తరఫున మీక్ థ్యాంక్స్ చెబుతున్నాను అని అనిల్ రావిపూడి చెప్పారు.
భగవంత్ కేసరి ప్రమోషన్స్ చాలా ఉన్నాయి. దసరా లోపు చాలా సార్లు కలుసుకోబోతున్నాం. ఈ టీజర్‌ను భాస్కర్ అద్బుతంగా కట్ చేశారు అని అనిల్ రావిపూడి తెలిపారు. అభిమానులు కోరడంతో భగవంత్ కేసరి సినిమాలో బాలకృష్ణ చెప్పిన హిందీ డైలాగ్.. పతా హై కానోంకే బీచ్ మే బేజా క్యో రహ్తీ హై.. జబ్ కాన్ బైరీ పడ్తీ హై.. తబ్ బాత్ సీదా బేజా మే గుస్తీ హై అంటూ అనిల్ రావిపూడి డైలాగ్ చెప్పి అభిమానులను జోష్ అందించారు.
భగవంత్ కేసరి సినిమా కోసం యంగ్ రైటర్స్ చాలా మంది పనిచేశారు. తెలంగాణ యాస అవసరం కావడంతో అజ్జు రాశాడు. వారందరికి నా థ్యాంక్స్. అభిమానులందరికి ఇది జస్ట్ బిగినింగ్. దసరా వరకు మళ్లీ కలుద్దాం అని అనిల్ రావిపూడి తెలిపారు.


Click it and Unblock the Notifications











