గుడ్ న్యూస్ చెప్పిన డైరెక్టర్ అనిల్ రావిపూడి: అందరూ ఆ పని చేయడంటూ లేఖ విడుదల

వరుసగా విజయవంతమైన చిత్రాలను రూపొందిస్తూ.. సక్సెస్‌నే ఇంటి పేరుగా మార్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి. కెరీర్ ఆరంభంలో ఎంతో మంది దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన అతడు.. కల్యాణ్ రామ్ హీరోగా నటించిన 'పటాస్'తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి గత ఏడాది వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' వరకు వరుసగా విజయాలను అందుకుంటూ వచ్చాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం 'F2'కు సీక్వెల్‌ను రూపొందిస్తున్నాడు. ఇలాంటి సమయంలో అనిల్ రావిపూడి కరోనా వైరస్ బారిన పడ్డాడు. ఈ నేపథ్యంలో తాజాగా అతడు గుడ్ న్యూస్ చెప్పాడు.

కొద్ది రోజుల క్రితం అనిల్ రావిపూడికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో అతడికి ఇంట్లోనే స్వయంగా ఐసోలేట్ అయ్యాడు. ఇక, తాజాగా అతడికి కోవిడ్ నెగెటివ్ వచ్చింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఓ ప్రకటనను విడుదల చేశాడు. 'ఈ నెల 13వ తేదీన జరిపిన టెస్టుల్లో నాకు కరోనా పాజిటివ్ వచ్చింది.

Anil Ravipudi Tested Negative for Covid 19

దీంతో నాతో ఉన్న వాళ్లందరినీ అలెర్ట్ చేసి టెస్టులు చేయించుకోమని చెప్పాను. అప్పటి నుంచి ఇంట్లోనే వైద్యుల సలహాలు పాటిస్తూ ఐసోలేషన్‌లో ఉంటున్నాను. ఇక, ఇప్పుడు నాకు కరోనా నెగెటివ్ వచ్చింది. దీంతో చాలా సంతోషంగా ఉన్నాను. నేను త్వరగా కోలుకోవాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. దయచేసి అందరూ వ్యాక్సిన్ వేయించుకుని.. కరోనా పట్ల జాగ్రత్తగా ఉండండి' అంటూ అందులో పేర్కొన్నాడతను.

ప్రస్తుతం అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తోన్న 'ఎఫ్‌3' మూవీ మైసూర్‌లో షూటింగ్‌ జరుపుకోవాల్సి ఉంది. కానీ, అతడికి కరోనా పాజిటివ్‌ రావడంతో.. షూటింగ్‌ని వాయిదా వేశారు. అయితే, ఇప్పుడు పరిస్థితులు బాగోకపోవడంతో షూటింగ్ ఎప్పుడు పున: ప్రారంభం అవుతుందో చెప్పలేని పరిస్థితి. దీనితో పాటు అనిల్ రావిపూడి.. నటసింహా నందమూరి బాలకృష్ణతోనూ ఓ మూవీ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X