తన హీరోలను ఇరికించిన డైరెక్టర్.. ఇక అందరూ ఆ పనులు చేయాల్సిందే

టాలీవుడ్‌లో ప్రస్తుతం BE The Real Man అనే ఛాలెంజ్ ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మొదలు పెట్టిన ఈ సవాల్.. అప్రతిహతంగా దూసుకుపోతోంది. స్టార్ హీరోలు, డైరెక్టర్లు అందరూ ఈ ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ.. ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇలా ఇది తిరిగి తిరిగి అనిల్ రావిపూడి వద్దకు వచ్చింది. ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఇంటి పనులు చేసిన ఈ డైరెక్టర్ తన హీరోలందరికీ ఈ సవాల్‌ను విసిరాడు.

కరోనా వేళ ఇంటి వద్ద మహిళలకు పనిభారం పెరుగుతోందని, ఇలాంటి సమయంలో వారికి సాయం చేయాల్సిన కనీస బాధ్యత మనదంటూ సందీప్ రెడ్డి ఇంటి పనులు చేస్తున్న వీడియోను షేర్ చేస్తూ.. ఇక ఈ చాలెంజ్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను రాజమౌళికి అప్పగించాడు. అక్కడి నుంచి ఎన్టీఆర్‌కు ఎన్టీఆర్ నుంచి వెంకీమామకు మళ్లీ అక్కడి నుంచి అనిల్ రావిపూడి వద్దకు ఛాలెంజ్ పాకింది.

 Anil Ravipudi Throws Challenge To Raviteja NKR And Sai Dharam Tej

నాటి జంధ్యాల కామెడీ సీన్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ.. ఇంట్లో వాళ్ళకి కొంత ఫ్రస్ట్రేషన్ రిలీఫ్. మనకి కొంత ఫన్.. అంటూ ఇంటి పనులను చకచకా పూర్తి చేసేశాడు కామెడీ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ మేరకు తదుపరి బాధ్యతను తన హీరోలందరికీ పంచాడు. మొదటి చిత్రానికి అవకాశం ఇచ్చిన కళ్యాణ్ రామ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, రవితేజ ఇలా తన హీరోలందరికీ ఛాలెంజ్ విసిరాడు. మరి వీరంతా ఎప్పుడు స్వీకరిస్తారో.. ఇంకా ఎవరెవరికో ఛాలెంజ్ విసురుతారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X