ఆ హీరోల కోసం మరో స్టార్ హీరో ప్రాజెక్టును పక్కన పెట్టిన అనిల్ రావిపూడి

కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలతో వరుస విజయాలను అందుకుంటున్న దర్శకుడు అనిల్ రావిపూడి మల్టీస్టారర్ ట్రెండును అలానే కొనసాగించేలా ఉన్నాడని టాక్ గట్టిగానే వస్తోంది. ఇక ఈ దర్శకుడితో వర్క్ చేయడానికి హీరోలు కూడా బాగానే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం F3 సినిమాకు ఫీనిషింగ్ టచ్ ఇస్తున్న విషయం తెలిసిందే.

వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న ఈ రెండవ మల్టీస్టారర్ పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సారి డబ్బు అనే కాన్సెప్ట్ తోనే అనిల్ తనదైన శైలిలో కామెడీని క్రియేట్ చేస్తున్నాడు. అసలు మ్యాటర్ లోకి వస్తే రవితేజ, రామ్ పొతినేని తో కూడా మరో మల్టీస్టారర్ సినిమా చేయనున్నట్లు టాక్ వస్తున్న విషయం తెలిసిందే.

Anil ravipudi upcoming projects latest updates and gossip viral

అయితే ఆ ఇద్దరి హీరోల కోసం అనిల్ బాలకృష్ణ ప్రాజెక్టును సైడ్ కు పెట్టినట్లు సమాచారం. బాలయ్య బాబుతో ఎప్పటి నుంచో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల కథను వినిపించగా కొన్ని మార్పులు అవసరమని బాలయ్య కూడా సలహాలు ఇచ్చారట.

ఇక మార్పులు చేయాలి అంటే కొంత టైమ్ పడుతుందని కొన్నాళ్ళు ఆ కథను పక్కకు పెట్టాలని డిసైడ్ అయ్యాడట. ఇక రవితేజ, రామ్ కోసం సెట్ చేసిన కథ రెడీగా ఉండడంతో ముందు ఆ సినిమాను పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X