అనిల్ రావిపూడికి రక్త తిలకం.. హడలెత్తించిన వెంకటేశ్-కల్యాణ్‌రామ్!

VenkyAnil5: అనిల్ రావిపూడి అంటే కేవలం సినిమాలను తెరకెక్కించడమే కాదు.. ప్రమోషన్స్‌‌తో కూడా ఎంటర్టైన్ చేస్తాడు. తన సినిమాపై హైప్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం విక్టరీ వెంకటేశ్, నందమూరి కళ్యాణ్‌రామ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ సినిమా తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కీర్తి సురేశ్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ నేపధ్యంలో అనిల్ రావిపూడి మరోసారి తన మార్క్ ప్రమోషన్ స్ట్రాటజీని చూపించారు. ఇంకా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాకముందే వరుసగా ప్రమోషన్ కంటెంట్ తో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నారు.

Also Read
Peddi Day 18 Box Office: వీకెండ్‌తో మళ్లీ పుంజుకున్న పెద్ది.. 18 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే?
Peddi Day 18 Box Office: వీకెండ్‌తో మళ్లీ పుంజుకున్న పెద్ది.. 18 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే?

ఇటీవల సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్, గేయ రచయిత అనంత్ శ్రీరామ్‌లతో చేసిన ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జంధ్యాల గారి 'వివాహ భోజనంబు' సినిమాలోని కామెడీ కాన్సెప్ట్ ను కాఫీ కొట్టేసి, ఆ సీన్ రీ క్రియేషన్ చేశారు. అందులో భాగంగా జీవీ ప్రకాష్‌ను ఇసుకలో పాతిపెట్టి ట్యూన్స్ కంపోజ్ చేయిస్తున్నట్లు చూపించారు. అలాగే, గేయ రచయిత అనంత్ శ్రీరామ్ ను కూడా ఇసుకలో పాతిపెట్టేశారు. దీంతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది.

Recommended For You
Cocktail 2 Day 3 Box Office Collections: వీకెండ్ లో 'కాక్‌టెయిల్ 2'దూకుడు.. రష్మిక మూవీకి ఎన్ని కోట్లంటే?
Cocktail 2 Day 3 Box Office Collections: వీకెండ్ లో 'కాక్‌టెయిల్ 2'దూకుడు.. రష్మిక మూవీకి ఎన్ని కోట్లంటే?
Anil Ravipudi s Crazy Promotion Goes Viral Venkatesh Kalyan Ram Shock Fans

అయితే తాజాగా మరో ప్రమోషన్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో ముందుగా మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్‌తో వెంకటేష్, కళ్యాణ్ రామ్ మాట్లాడుతుంటారు. లాస్ట్ టైం నిన్ను ఇసుకలో పాతేశారంటీ పాపమని వెంకటేష్ అంటాడు. దీంతో పక్కనే ఉన్న కళ్యాణ్ రామ్ ' పటాస్ టైమ్ లో అనిల్ బాగానే ఉన్నాడు. కానీ 'నేను పాడతా' అంటూ మీరే అతన్ని పాపారింగ్ చేశారని కళ్యాణ్ రామ్ కౌంటర్ ఇస్తాడు. అప్పుడే హీరోయిన్లు కీర్తి సురేష్, కృతి శెట్టి భయంతో పరుగెత్తుకుంటూ వస్తారు. దీంతో ఏమైందని వెంకటేష్ ప్రశ్నించగా.. ఆ హీరోయిన్లు కత్తి పట్టుకుని వస్తున్న అనిల్ రావిపూడి చూపిస్తారు.

You May Also Like
ఇండస్ట్రీకి మరో కమల్ హాసన్ దొరికేశాడు.. డైరెక్టర్ మహా కామెంట్స్ వైరల్!
ఇండస్ట్రీకి మరో కమల్ హాసన్ దొరికేశాడు.. డైరెక్టర్ మహా కామెంట్స్ వైరల్!

ఏంటీ అనిల్ అని వెంకటేష్ ప్రశ్నించగా.. కత్తిలాంటి ఐడియాలతో ప్రమోషన్లు చేస్తున్నానని ఫ్యాన్స్ చేతిలో కత్తి పెట్టారని అనిల్ గర్వంగా చెబుతాడు. ఎప్పుడూ నేనే ఐడియా ఇవ్వాలా? మీరు ఇవ్వండని అడుగుతాడని హీరోలను అడుగుతారు అనిల్. అప్పుడే కత్తి లాంటి ఐడియా అంటూ వెంకటేష్.. అనిల్ రావిపూడి వేలుని కట్ చేసి రక్తంతో విజయ తిలకం దిద్దుతాడు వెంకీ. ఆ తరువాత కళ్యాణ్ రామ్, హీరోయిన్లు కీర్తి సురేశ్, కృతి శెట్టి కూడా అనిల్ కు రక్త తిలకం దిద్దారు.

నాకు అలాంటి సమస్యలు.. ఎన్నో కష్టాలు.. బిగ్‌బాస్ తనూజ మనసులో బాధ..
నాకు అలాంటి సమస్యలు.. ఎన్నో కష్టాలు.. బిగ్‌బాస్ తనూజ మనసులో బాధ..

అప్పుడే వెంకటేష్- కళ్యాణ్ రామ్ మల్టీ స్టారర్ మూవీ స్టోరీ ప్లాట్ ను అనిల్ రావిపూడి వెల్లడిస్తాడు. 'ఎంత రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో కథ సాగితే మాత్రం రక్త పాతం ఉంటుందా? మనది ఫ్యామిలీ కామెడీ మూవీ' అని అనిల్ రావిపూడి ప్రకటించారు. దీనిని బట్టి చూస్తే ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు. VenkyAnil5 - NKRAR2 వర్కింట్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ జూన్ 22 నుంచి ప్రారంభం కానున్నది. ఈ సినిమా 2027 సంక్రాంతి బరిలో దిగనున్నది. మరి అనిల్ మ్యాజిక్ ఎలా వర్క్ అవుతోందో వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X