twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అది సికింద్రాబాద్ కాదు సింగపూర్.. సరిలేరు మేనియాను చూపిస్తోన్న నిర్మాత

    |

    సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు చిత్రం నేడు (జనవరి 11) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమ హీరోను మాస్ సినిమాలో చూసి చాలా కాలమైందని, సూపర్ స్టార్‌లోని మాస్‌ను బయటకు తీసుకురండని కోరిన ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చేలా ఉంది సరిలేరు నీకెవ్వరు. టీజర్, ట్రైలర్‌తోనే భారీ హైప్ క్రియేట్ చేసిన సరిలేరు టీమ్.. ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేసింది.

    దాదాపు 80శాతం థియేటర్లలో..

    దాదాపు 80శాతం థియేటర్లలో..

    భరత్ అనే నేను, మహర్షి వంటి చిత్రాలు చేసి క్లాస్ లుక్‌లో కనిపించిన మహేష్.. మాస్ అవతారమెత్తి సరిలేరులో విజృంభించాడు. రిలీజ్‌కు ముందే సోషల్ మీడియాలో సెన్సేషన్ స‌ృష్టించిన సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 80 శాతం థియేటర్లలో విడుదల చేశారు. సోలో రిలీజ్ కావడం పోటీకి ఏ చిత్రం లేకపోవడంతో ఫస్ట్ డే కలెక్షన్లో రికార్డులు క్రియేట్ చేసేలా కనిపిస్తోంది.

    ఓవర్సీస్‌లోనూ భారీ ఎత్తున...

    ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేశారు. ఓవర్సీస్‌లో మిలియన్ డాలర్ల మార్క్‌ను సాధించేందుకు ఇప్పటికీ ఎంతో మంది ప్రయత్నిస్తుండగా.. కేవలం ప్రీమియర్స్, ఫస్ట్ డే కలెక్షన్లతో ఆ మార్క్‌ను అవలీలగా దాటేయనున్నట్లు తెలుస్తోంది. కేవలం యూస్‌లోనే కాకుండా.. సింగపూర్, దుబాయ్ లాంటి దేశాల్లోనూ మహేష్ మ్యానియా కొనసాగుతోంది. దీనికి ఉదాహరణంగా ఓ వీడియోను పోస్ట్ చేశాడు నిర్మాత.

    సింగపూర్‌లోనూ హల్ చల్..

    సింగపూర్‌లోనూ హల్ చల్..

    సింగపూర్‌లోని ఓ థియేటర్‌లో ఉన్న క్రౌడ్‌ను చూపిస్తూ.. ఇది సికింద్రాబాద్ కాదు.. సింగపూర్ అంటూ వీడియోను పోస్ట్ చేస్తూ ట్వీట్ చేశాడు. ఇదే సూపర్ స్టార్ రేంజ్ అన్నట్టుగా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    బొమ్మ బ్లాక్ బస్టర్..

    బొమ్మ బ్లాక్ బస్టర్..

    తాను నిర్మించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ కావడంతో నిర్మాత అనిల్ సుంకర ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా సరిలేరుకు సంబంధించిన పోస్ట్‌లు పెడుతున్నాడు. ఇంతకు ముందు కృష్ణ రియాక్షన్ పెట్టగా అది కూడా వైరల్ అయింది.

    English summary
    Anil Sunkara About Sarileru Neekevvaru Talk In Singapore. This is not secunderabad. Its Singapore, but it is Superstar’s SarileruNeekevvaru .
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X