Just In
- 21 min ago
ఆ డైరెక్టర్ రూంకి పిలిచి అక్కడ తాకాడు.. ప్రైవేట్ పార్టు చూపిస్తూ: టాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు
- 33 min ago
క్రాక్ హిట్టుతో దర్శకుడికి భారీగా రెమ్యునరేషన్.. మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్
- 1 hr ago
మోనాల్‌తో పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన అఖిల్: ఆ బట్టల్లో చాలా హాట్‌గా.. ఊహించని విధంగా కామెంట్స్!
- 2 hrs ago
టాలీవుడ్ యంగ్ హీరోపై కేసు నమోదు: నమ్మించి మోసం చేశాడంటూ ఫిర్యాదు.. స్పందించకపోవడంతో!
Don't Miss!
- Sports
నాకూ కరోనా వచ్చింది.. వైరస్ జోక్ కాదు: సానియా
- News
ప్రాణాలు తీసిన పొగమంచు: వాహనం నుజ్జునుజ్జు: 13 మంది దుర్మరణం: రహదారి రక్తసిక్తం
- Finance
అది సరిపోదు.. ఇంకా: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు గట్టి షాకిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం!
- Lifestyle
బుధవారం దినఫలాలు : మీన రాశి వారు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు...!
- Automobiles
కుటుంబం కోసం ఆటో డ్రైవర్‌గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మరోసారి లెజెండ్ కాంబినేషన్: కథ విన్న వెంటనే ఫ్లాట్ అయిన బాలయ్య
జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా ప్రాజెక్టులు చేసుకుంటూ పోయే హీరోల్లో నటసింహా నందమూరి బాలకృష్ణ ఒకరు. సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో ఉన్న ఆయన.. ఎన్నో పరాజయాలను చవి చూశారు. అయినప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా దూసుకుపోతుంటారు. గత ఏడాది వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్ అయినా.. తగ్గేదే లేదన్నట్లుగా కొత్త ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన మరో చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది.
నందమూరి బాలకృష్ణ నటించిన 'లెజెండ్' సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ ఏడాది అన్ని రికార్డులను బద్దలు కొట్టడంతో పాటు ఆయన కెరీర్‌లోనే భారీ హిట్‌గా నిలిచింది. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర.. తాజాగా బాలయ్యకు ఓ కథను వినిపించారని సమాచారం. అది విన్న వెంటనే ఇప్రెస్ అయిన ఆయన... వీలైనంత త్వరగా దాన్ని పట్టాలెక్కిద్దామని చెప్పినట్లు తెలుస్తోంది. అందుకోసం సరైన దర్శకుడిని కూడా ఎంపిక చేయమని సూచించినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉండగా, ప్రస్తుతం బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్నారు. 'సింహా', 'లెజెండ్' వంటి రెండు భారీ హిట్ల తర్వాత వీళ్ల కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. అందులో ఒకటి పవర్‌ఫుల్ రైతు పాత్ర కాగా, రెండోది అఘోరా రోల్ అని ప్రచారం జరుగుతోంది. అలాగే, ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్‌గా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక, ఈ సినిమాలో హీరోయిన్‌గా ఇంకా ఎవరినీ ఫైనల్ చేయలేదు.