twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరోసారి లెజెండ్ కాంబినేషన్: కథ విన్న వెంటనే ఫ్లాట్ అయిన బాలయ్య

    |

    జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా ప్రాజెక్టులు చేసుకుంటూ పోయే హీరోల్లో నటసింహా నందమూరి బాలకృష్ణ ఒకరు. సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో ఉన్న ఆయన.. ఎన్నో పరాజయాలను చవి చూశారు. అయినప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా దూసుకుపోతుంటారు. గత ఏడాది వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్ అయినా.. తగ్గేదే లేదన్నట్లుగా కొత్త ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన మరో చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది.

    నందమూరి బాలకృష్ణ నటించిన 'లెజెండ్' సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ ఏడాది అన్ని రికార్డులను బద్దలు కొట్టడంతో పాటు ఆయన కెరీర్‌లోనే భారీ హిట్‌గా నిలిచింది. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర.. తాజాగా బాలయ్యకు ఓ కథను వినిపించారని సమాచారం. అది విన్న వెంటనే ఇప్రెస్ అయిన ఆయన... వీలైనంత త్వరగా దాన్ని పట్టాలెక్కిద్దామని చెప్పినట్లు తెలుస్తోంది. అందుకోసం సరైన దర్శకుడిని కూడా ఎంపిక చేయమని సూచించినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

    Anil Sunkara and Balakrishna Reunion for New Project

    ఇదిలా ఉండగా, ప్రస్తుతం బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్నారు. 'సింహా', 'లెజెండ్' వంటి రెండు భారీ హిట్ల తర్వాత వీళ్ల కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. అందులో ఒకటి పవర్‌ఫుల్ రైతు పాత్ర కాగా, రెండోది అఘోరా రోల్ అని ప్రచారం జరుగుతోంది. అలాగే, ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్‌గా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక, ఈ సినిమాలో హీరోయిన్‌గా ఇంకా ఎవరినీ ఫైనల్ చేయలేదు.

    English summary
    Director Boyapati Srinu will be directing Nandamuri Balakrishna in his next movie. There are more expectations from the fans on the combination of Boyapati Srinu and Balakrishna because of previous hit movies.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X