రష్మిక మందన్నాతో ఎంగేజ్‌మెంట్.. ఎట్టకేలకు బాలీవుడ్ హాట్ బ్యూటీతో పెళ్లి.. ఆ హీరో ఎవరో తెలుసా?
ఈ ముధ్య కాలంలో.. ముఖ్యంగా ఈ ఏడాది అనేక మంది సినీ సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. బ్యాచ్ లర్ లైఫ్ కు గుడ్ బై చెప్పేసి ఓ ఇంటి వాళ్లు అయిపోతున్నారు. టాలీవుడ్ కు చెందిన ఎంతో సినీ నటులు ఇప్పటికే పెళ్లి చేసుకోగా.. బాలీవుడ్ కు చెందిన చాలా మంది ప్రముఖులు కూడా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. తాజాగా ఓ బాలీవుడ్ హీరో పెళ్లి పీటలు ఎక్కాడు. అయితే వధువు కూడా సినీ రంగానికి చెందిన అమ్మాయే కావడం.. అందులోనూ హీరోయిన్, హాట్ బ్యూటీ కావడం మరింత విశేషం. అయితే మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన ఆ కొత్త జంట ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బాలీవుడ్ కు చెందిన నటుడు కునాల్ ఠాకూర్... తాజాగా పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడయ్యాడు. అయితే ఈయన పెళ్లి చేసుకుంది మరెవరినో కాదండోయ్.. బాలీవుడ్ హాట్ బ్యూటీ ముక్తి మోహన్ నే. మంచి డ్యాన్సర్ గా, మోడల్ గా, నటిగా, హీరోయిన్ గా గుర్తింపు పొందిన ముక్తి మోహన్ ను.. కునాల్ ఠాకూర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కేవలం హిందీలోనే కాకుండా.. దరువు సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మ ఐటెం సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులు వేసింది. అంతే కాకుండా లస్ట్ స్టోరీస్ 2, థార్ వంటి చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. అనేక టీవీ షోల్లోనూ కనిపించి అందరినీ అలరించిందీ హాట్ బ్యూటీ. 34 ఏళ్ల వయసు కల్గిన ఈ హాట్ బ్యూటీ 2007 నుంచి ఇప్పటికీ సినీ రంగంలోనే కొనసాగుతోంది.

అయితే కునాల్ ఠాకూర్.. ఇటీవలే యానిమల్ సినిమాలోనూ కనిపించి మెప్పించాడు. ముఖ్యంగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నాతో ఈ సినిమాలో ఎంగేజ్ మెంట్ చేసుకునే అబ్బాయిగా కనిపించాడు. ఇలా హీరో వచ్చి దాన్ని బ్రేక్ చేశాడు. అలా కునాల్ ఠాకూర్.. రీల్ లైఫ్ లో రష్మిక మందన్నాతో నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకుని.. రియల్ లైఫ్ లో బాలీవుడ్ హాట్ బ్యూటీ ముక్తి మోహన్ ను పెళ్లి చేసుకున్నాడు. ఒక్క యానిమల్ సినిమాలోనే కాదండోయ్.. అంతకు ముందు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వచ్చిన కబీర్ సింగ్ చిత్రంలోనూ కనిపించాడీ నటుడు. తాజాగా చడీ చప్పుడు లేకుండా కునాల్ పెళ్లి చేసుకున్నారు. ఈక్రమంలోనే ఇన్ స్టాగ్రామ్ వేధికగా తమను ఆశీర్వదించమంటూ కోరారు.

కునాల్ ఠాకూర్, ముక్తి మోహన్ లకు సంబంధించిన పెళ్లి ఫొటోలు చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున అభినందనలు తెలుపుతున్నారు. కంగ్రాట్స్, అభినందనలు అంటూ పెద్ద ఎత్తున విషెస్ చెబుతున్నారు. వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట ఫుల్ వైరల్ గా మారాయి. మీరూ ఓసారి ఆ అద్భుతమైన ఫొటోలు చూసి ఈ కొత్త జంటను దీవించేయండి. ఇంకెందుకు ఆలస్యం.


Click it and Unblock the Notifications











