Tripti Dimri Remuneration: రష్మిక మందన్నకు 4 కోట్ల రెమ్యునరేషన్.. కానీ తృప్తి దిమ్రికి ఎంత ఇచ్చారో తెలుసా?
ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న హీరోయిన్ల పేర్లలో.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నాతో పాటు త్రిప్తి దిమ్రి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. యానిమల్ సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మల పేర్లు సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా గ్లామరస్ రోల్ లో ఇంటిమెట్ సీన్ల్ లో కనిపించిన త్రిప్తి దిమ్రికి ఫుల్ మార్కులు పడ్డాయి. అద్భుతంగా నటించిందని.. అంతకు మించిన అందం ఉందంటూ అంతా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ప్రస్తుతం 29 ఏళ్ల వయసు కల్గిన ఈ క్యూట్ బ్యూటీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.
ముఖ్యంగా 2017లో మామ్ అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె అదే ఏడాది పోసట్ బాయ్స్ అనే చిత్రంలోనూ నటించి మెప్పించింది. ఇ క ఆ తర్వాత లైలా మజ్నూ, బుల్ బుల్, కళ వంటి చిత్రాల్లో కూడా చేసింది. కేవలం సినిమాలే కాకుండా 2018లో నాగిన్ సీరియల్ సీజన్ 3లోనూ ప్రత్యేక ప్రదర్శన చేసి విపరీతమైన క్రేజ్ సంపాధించింది. అలాగే 2021లో ఫోర్బ్స్ ఆసియా 30 అండర్ 30 జాబితాలో కూడా చోటు దక్కించుకుంది. రెడిఫ్ డాట్ కామ్ 2020 బాలీవుడ్ ఉత్తమ నటీమణుల జాబితాలో 8వ స్థానాన్ని దక్కించుకుంది.

ఇవి మాత్రమే కాకుండా టైమ్స్ ఆఫ్ ఇండియా 50 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ లిస్ట్ ఆఫ్ 2020లో కూడా 20వ స్థానంలో నిలిచి అందరినీ ఆకట్టుకుంది. అంతేకాకుండా 2020లో ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డులలో ఆమెకు వెబ్ ఒరిజినల్ ఫిల్మ్‌లో ఉత్తమ నటి పురస్కారం కూడా దక్కింది. ఇలా తన అందం, అభినయంతో అతి తక్కువ సమయంలోనూ అద్భుతమైన రికార్డులను సొంతం చేసుకుంది. ఇక ఇటీవలే వచ్చిన యానిమల్ చిత్రంలో అద్భుతమైన నటనను, అందాన్ని కనబర్చి కుర్రకారు కలల రాణిలా మారిపోయింది. అయితే గతంలో ఈ ముద్దుగుమ్మను ఫాలో అయ్యే వారి సంఖ్య చాలా తక్కువగా ఉండగా... యానిమల్ రిలీజ్ అయిన తర్వాత నుంచి ఫాలోవర్ల సంఖ్య డబుల్ అయ్యింది.

ఇంత ఎక్కువ మొత్తంలో అభిమానులను సొంతం చేసుకుంటున్న ఈ హాట్ బ్యూటీకి సంబంధించిన అనేక విషయాలు వైరల్ అవుతున్నాయి. తాజాగా యానిమల్ సినిమాలో నటించేందుకు ఈమె తీసుకున్న రెమ్యునరేషన్ పై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ చిత్రంలో నటించేందుకు హీరోయిన్ రష్మిక మందన్నా రూ.4 కోట్లు పారితోషికంగా అందుకోగా.. త్రిప్తి దిమ్రి మాత్రం కేవలం 40 లక్షల రూపాయలు మాత్రమే అందుకుందట. ఈసినిమాలో ఆమె తక్కువగానే అందుకున్నప్పటికీ.. దీని ద్వారా వచ్చిన క్రేజ్ తో తర్వాత చేయబోయే సినిమాల్లో రెమ్యునరేషన్ ను డబుల్ చేయబోతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. చూడాలి మరి ఈ ముద్దుగుమ్మ దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకుంటుందా లేదా అనేది.


Click it and Unblock the Notifications











