Animal Movie: థియేటర్లలలో ఒకలా, ఓటీటీలో మరోలా.. యానిమల్ మూవీ పూర్తి రన్ టైమ్ ఎంతో తెలుసా?
అర్జున్ రెడ్డి సినిమాతో అద్భుతమై హిట్టును తన ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈయన దర్శకత్వంలో తాజాగా రాబోతున్న చిత్రం యానిమల్. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక హీరోహీరోయిన్లుగా వస్తున్న ఈ సినిమాపై పెద్ద ఎత్తన బజ్ క్రియేట్ అయింది. ముఖ్యంగా సందీప్ రెడ్డి సినిమా కావడం, స్టార్ హీరోహీరోయిన్లు ఇందులో నటించడం.. అదీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతుందని తెలియగా అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా.. విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో ట్రెండింగ్ నిలిచింది. కేవలం ట్రైలర్ మాత్రమే కాకుండా అంతకు ముందు వచ్చిన టీజర్, పాటలకు కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. అవి కూడా యూట్యూబ్ లో రికార్డు క్రియేట్ చేశాయి. ఇంతటి బజ్ ఏర్పడిన ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. ముఖ్యంగా ఈ సినిమా రన్ టైమ్ పై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇటీవలే ఈ సినిమా రన్ టైమ్ 3.29 నిమిషాలు అని తెలియగానే అభిమానులు అంతా అవాక్కయ్యారు.

ముఖ్యంగో సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. రెండు ఇంటర్వెల్స్ పెడితే తప్ప సినిమాను ఎవడూ చూడడంటూ చాలా మంది నెగిటివ్ కామెంట్లు చేశారు. అయితే అంతసేపు సినిమా చూడడం నిజంగా కష్టమే. ఎవరూ గంటల తరబడి థియేటర్లలో కూర్చొని సినిమా చూసేందుకు ఇష్టపడరు. ఈ విషయం అర్థం చేసుకున్న చిత్ర బృందం రన్ టైమ్ ను మార్చింది. ముఖ్యంగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమా రన్ టైమ్ ను అతి కష్టంగా 28 నిమిషాల వరకూ తగ్గించారట. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్ల రన్ టైమ్ ను 3.21కు ఫిక్స్ చేశారట. ఈ విషయాన్ని నేరుగా హీరో రణ్ బీర్ కపూర్ యే వెల్లడించారు.
ఇదిలా ఉండగా.. ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ వివరాలు కూడా ఇప్పటికే తెలిసిపోయాయి. అంటే ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందనే దానిపై క్లారిటీ లేదు కానీ.. సినిమా విడుదల అయిన ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలోకి రాబోతున్నట్లు సమచారం. అంతే కాదండోయ్ ఈ సినిమా థియేటర్లలోలాగా 3.21 గంటలే కాకుండా అంతకు మించి ఉండబోతుందట. అంటే ఈ సినిమా రన్ టైమ్ ను కుదించకముందు ఉన్న 3.49 ను ఫిక్స్ చేశారట. థియేటర్లలో చూసే వారికంటే కూడా ఓటీటీలో చూసే వారికి మరింత ఎక్కువ చూసే అవకాశం కల్పించారు.

ఇదిలా ఉండగా.. రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న యానిమల్ సినిమాను టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్, ప్రణయ్ రెడ్డి వంగాలు నిర్మిస్తున్నారు. దీనికి ప్రీతమ్, విశాల్ మిశ్రా తదితరులు సంగీతాన్ని అందించారు. అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్ వంటి వాళ్లు కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రం డిసెంబర్ 1వ తేదీన విడుదల కాబోతుంది.


Click it and Unblock the Notifications











