Animal Twitter Review రణ్‌బీర్ నెవ్వర్ బిఫోర్. సందీప్ డైరెక్షన్ బ్రిల్లియెంట్. యానిమల్ ఎలా ఉందంటే?

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ చిత్రాలతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకొన్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన యానిమల్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 1వ తేదీన రిలీజ్‌ అవుతున్నది. ఇప్పటికే ఈ సినిమాపై బజ్ భారీగా క్రియేట్ అయింది. ఈ సినిమాను అమెరికాలో ఒక రోజు ముందే ప్రిమియర్లు ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో ట్విట్టర్‌లో నెటిజన్లు ఈ సినిమాపై ఎలా స్పందించారనే వివరాల్లోకి వెళితే..


యానిమల్ సినిమాకు ముందు రణ్‌బీర్ వీడియో రిలీజ్ చేసి.. అమెరికాలోని ప్రేక్షకులకు శుభవార్త. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ఒక రోజు ముందే ప్రీమియర్లు ప్రదర్శిస్తున్నాం. వెంటనే మీరు టికెట్ బుక్ చేసుకొని ఈ సినిమాను ఎంజాయ్ చేయమని అడిగారు.

Animal Movie Twitter Review: Sandeep Reddy Vanga Screen Magic with Ranbir Kapoor.

ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలో బిగ్ డే. స్క్రీన్లలో సినిమాటిక్ మ్యాజిక్ ఊహించబోతున్నాం. ఈ సినిమా అద్బుతమైన అనుభూతిని అందిస్తుందని ఆశిస్తున్నాం. ఈ రోజు డబుల్ ధమాకా. సలార్ ట్రైలర్ కూడా రిలీజ్ కాబోతున్నది. నాకు డబుల్ ఎక్సైట్‌మెంట్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

యానిమల్ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావాలని విష్ చేస్తున్నాను. రణ్ బీర్ కపూర్, బాబీ డియోల్, సందీప్ వంగ, అనిల్ కపూర్‌కు మంచి విజయం లభించాలి. అల్ ది బెస్ట్ సందీప్, రణ్‌బీర్ అంటూ కామెంట్ చేశాడు.

యానిమల్ సినిమాలో రణ్‌బీర్ కపూర్ ఇంతకు ముందెన్నడూ చూడని అవతారంలో కనిపించాడు. రణ్ బీర్ కెరీర్ బెస్ట్ ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నాడు. ఈ సినిమాకు నా రేటింగ్ 3.5. అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

యానిమల్ మూవీ పక్కా యాక్షన్ మూవీ. ఈ సినిమాకు రణ్‌బీర్ కపూర్ బ్యాన్ బోన్. డైరెక్షన్ బ్రిల్లియెంట్. బీజీఎం మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. 1000 కోట్ల కలెక్షన్లు పక్కా అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

యానిమల్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అవుతుందని బలంగా నమ్ముతున్నాను. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాకుండా ఈ సినిమాలో అందర్నీ ఆకట్టుకొనే గ్రిప్పింగ్ ఎలిమింట్స్ చాలా ఉన్నాయి అని ఓ నెటిజన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

యానిమల్ గ్రేట్ మూవీ. మీరు మిస్ చేసుకోవద్దు. ఈ సినిమాను మరోసారి చూడటానికి రేపు వస్తున్నాను అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన యానిమల్ మూవీని ఇప్పుడే చూశాను. ఏముందిరా సినిమా అనేలా ఉంది. ఈ సినిమా చూసిన తర్వాత చాలా రోజులు వెంటాడే సినిమా ఇది. నటనపరంగా రణ్‌బీర్ విశ్వరూపం చూపించాడు అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

యానిమల్ సినిమా చూశాను. అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా రికార్డులను ఈ చిత్రం బ్రేక్ చేయబోతున్నది. ఎవరూ అందుకోలేనంతగా రికార్డులు క్రియేట్ అవుతాయి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

యానిమల్ మూవీ చూశాను. రణ్‌బీర్ కపూర్ యాక్టింగ్ అదిరిపోయింది. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ సూపర్బ్. ఈ సినిమా గురించి చెప్పడానికి మాటలు లేవు. బ్లాక్ బస్టర్ అని నా రివ్యూ. నేను 4 రేటింగ్ ఇస్తాను. ఓవరాల్‌గా తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

యానిమల్ మూవీ విషయానికి వస్తే.. మాస్టర్ పీస్ మూవీ. బంధాలు, అనుబంధాల ఆధారంగా వచ్చిన సినిమాల్లో మైలురాయిగా నిలిచే సినిమా ఇది. 3.21 గంటల సినిమా అంంటూ నిడివిని ప్రశ్నించే వారికి అనేక సమాధానాలు సూపర్బ్‌గా లభిస్తాయి. సందీప్ రెడ్డి వంగా సినిమాకు నేను ఇచ్చే రేటింగ్ 5/5 అంటూ ఓ నెటిజన్ రివ్యూ ఇచ్చాడు.

యానిమల్ మూవీ వావ్ అనిపించే విధంగా ఉంది. ప్రతీ సీన్ గూస్ బంప్స్. రాగింగ్ ఎపిసోడ్ కేక పెట్టించింది. ఇప్పటి వరకు చూసిన ప్రతీ సీన్ బాగుంది అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

యానిమల్ సినిమా చూశాను. ఈ సినిమాకు A సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారో తెలియదు. అడల్ట్ సినిమా కాదు. అడల్డ్ సినిమా+ భీకరమైన హారర్ సినిమాకు సమానం. గుండె బలహీనంగా ఉండే వాళ్లు చాలా జాగ్రత్తగా చూడాలి. రణ్‌బీర్ కపూర్, అభయ్ డియోల్, రష్మిక మందన్న, అనిల్ కపూర్ అదరగొట్టారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X