'చిట్టి'ని తన స్టూడియోకు తీసుకెళ్లిన అనిరుద్ రవిచంద్రన్!
యువ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ సూపర్ స్టార్ రజనీకాంత్ కు పెద్ద అభిమాని. ఇప్పుడు దేశం మొత్తం 2.0 మానియా నెలకొంది. అనిరుద్ కూడా ఇందుకు అతీతుడుకాదు. 2.0 చిత్రం కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ఉన్నాడు. అందుకే ఏకంగా చిట్టి రోబోని తీసుకుని వచ్చి తన స్టూడియోలో పెట్టేసుకున్నాడు.
రజనీకాంత్ చిట్టి ఆకారంలో ఉన్న రోబో అనిరుద్ స్టూడియోలో ఉంది. చిట్టికి హాయ్ చెప్పండి అంటూ అనిరుద్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ వైరల్ గా మారుతోంది. ఇదిలా ఉండగా అనిరుద్ తొలిసారి రజనీకాంత్ చిత్రానికి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజ్ దర్శత్వంలో తెరకెక్కుతున్న పెట్ట చిత్రానికి అనిరుద్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది.

శంకర్ 2.0 చిత్రం నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన 2.0 చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 10వేల స్క్రీన్స్ లో విడుదలవుతోందని సమాచారం. అక్షయ్ కుమార్ ఈ చిత్రంలో భయంకరమైన విలన్ గా కనిపించబోతున్నాడు. అమీజాక్సన్ హీరోయిన్ గా నటించింది. 2.0 సృష్టించే సంచలనాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది.


Click it and Unblock the Notifications











