OG: పవన్ మూవీ కోసం యంగ్ సెన్సేషన్.. సుజిత్ చేసిన పనికి మేటర్ లీక్

గతంలో కంటే ఈ మధ్య కాలంలోనే వరుసగా ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూ దూసుకుపోతోన్నాడు టాలీవుడ్ బడా హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇండస్ట్రీలోకి కమ్ బ్యాక్ అయిన తర్వాత 'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్' వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ స్టార్ హీరో.. ఇప్పుడు మరిన్ని చిత్రాలను చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్నాడు. అదే సమయంలో రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల చాలా నెమ్మదిగానే షూటింగ్‌లలో పాల్గొంటూ ద్విపాత్రాభినయం చేస్తోన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన మరో కొత్త ప్రాజెక్టును కూడా ప్రకటించి ఆశ్చర్యపరిచాడు.

ఇప్పటికే పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు', 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాలను ప్రకటించేశాడు. వీటితో పాటు సముద్రఖనితో ఒకటి, సురేందర్ రెడ్డితో మరో మూవీ చేయబోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే 'సాహో' ఫేం సుజిత్‌తో కూడా ఓ ప్రాజెక్టును ప్రకటించాడు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమా గ్యాంగ్‌స్టర్ స్టోరీతో తెరకెక్కబోతుందని చిత్ర యూనిట్ పోస్టర్ ద్వారా వెల్లడించింది. అంతేకాదు, OG (ఓరిజినల్ గ్యాంగ్‌స్టర్) అంటూ సినిమాపై ఓ హిట్ కూడా ఇచ్చేసింది. ఇక, ఇందులో పవన్ కల్యాణ్ గన్ పట్టుకుని నిల్చున్న స్టిల్ చూపించడంతో దీనిపై అంచనాలు పెరిగిపోయాయి.

Anirudh Ravichander Fix for Pawan Kalyan and Sujeeth Movie

క్రేజీ కాంబినేషన్‌లో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా కోసం దర్శకుడు సుజిత్ తాజాగా మ్యూజిక్ డైరెక్టర్‌ను ఎంపిక చేసుకున్నాడని తెలిసింది. గతంలో దీనికి జిబ్రాన్ పని చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. కానీ, తాజా సమాచారం ప్రకారం.. కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్‌ను తీసుకున్నారట. తాజాగా దర్శకుడు సుజిత్ అతడిని ట్విట్టర్‌లో ఫాలో అవడం మొదలెట్టాడు. దీంతో ఈ న్యూస్ వెలుగులోకి వచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో పవర్ స్టార్ ఫ్యాన్స్ తెగ పోస్టులు చేస్తోన్నారు. దీంతో ఇప్పుడీ న్యూస్ హాట్ టాపిక్ అవుతోంది.

Anirudh Ravichander Fix for Pawan Kalyan and Sujeeth Movie

సుజిత్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటించబోయే సినిమాను వచ్చే జనవరి 30వ తేదీ నుంచి మొదలు పెట్టబోతున్నట్లు ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. ఈ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. మరోవైపు, ఈ సినిమాలో హీరోయిన్ ఉండదని, పాటలు కూడా ఉండవని ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X