Vijay Devarakonda సినిమా కోసం ఫస్ట్ టైమ్ అనిరుధ్ మ్యూజిక్.. కాంబినేషన్ అదిరింది!
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఆసక్తికరమైన లైనప్ తో సిద్ధమవుతున్నాడు. ఇంతకుముందు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన ఫ్యాన్ ఇండియా మూవీ లైగర్ అంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ విజయ్ దేవరకొండ ఏమాత్రం తగ్గలేదు అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం అతని సినిమాలకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ వస్తున్నా కూడా ఇంటర్నెట్ ప్రపంచంలో ట్రేండింగ్ లిస్టులో చేరుతున్నాయి.
విజయ్ తప్పకుండా తదుపరి సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అందుకుంటాడు అని అనిపిస్తోంది. ఇక ప్రస్తుతం అతని సినిమాలకు సంబంధించిన గాసిప్స్ చాలానే వైరల్ అవుతున్నాయి. ఇక విజయ్ దేవరకొండ కాంబినేషన్ పై కూడా అంచనాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. తన 12వ సినిమాను విజయ్ గౌతమ్ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే.

జెర్సీ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈ దర్శకుడు విజయ్ దేవరకొండతో ఒక డిఫరెంట్ పోలీస్ బ్యాక్ డ్రాప్ సినిమా చేయబోతున్నాడు. అయితే ఆ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ సెలెక్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంతకుముందే జెర్సీ సినిమా ద్వారా గౌతమ్ అనిరుద్ నుంచి మంచి మ్యూజిక్ తీసుకున్నాడు.
ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ తో చేస్తున్న మొదటి సినిమా కావడంతో అతని సినిమాకు కూడా అనిరుధ్ అయితే బెటర్ అని ఆలోచిస్తున్నాడు. అలాగే చర్చల్లో జీవి ప్రకాష్ పేరు కూడా వచ్చినట్లుగా తెలుస్తోంది. ఎక్కువగా ఫ్యాన్స్ నుంచి అయితే అనిరుధ్ అయితే బెటర్ ఆలోచనతో ఉన్నారట. ఇక ప్రస్తుతం అనిరుద్ సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్న సంగీత దర్శకులలో ఒకరు. ప్రస్తుతం అతని లైనప్ కూడా చాలా పెద్దగానే ఉంది. మరి విజయ్ అనిరుధ్ కాంబినేషన్ సెట్ అవుతుందో లేదో కాలమే సమాధానం చెప్పాలి. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి.


Click it and Unblock the Notifications











