PSPK28: పవన్ ఆఫర్ రిజెక్ట్ చేసిన యంగ్ సెన్సేషన్.. సౌత్‌లో ఇదే హాట్ టాపిక్

గతంలో కంటే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా సినిమాల మీద సినిమాలను చేసుకుంటూ దూసుకుపోతోన్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. 'వకీల్ సాబ్' మూవీతో కమ్‌బ్యాక్ అయిన ఈ మెగా హీరో.. ఆ తర్వాత 'భీమ్లా నాయక్'తో వచ్చి ప్రేక్షకులకు అలరించాడు. ఈ ఫలితాలను ఏమాత్రం బేరీజు వేసుకోకుండా పవర్ స్టార్ ఇప్పుడు పలు ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా మారిపోయాడు. అదే సమయంలో రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల చాలా నెమ్మదిగానే షూటింగ్‌లలో పాల్గొంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే పవన్ మరో కొత్త సినిమా ప్రకటించాడు.

ప్రస్తుతం పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' మూవీ చేస్తున్నాడు. ఇది షూటింగ్ జరుగుతుండగానే హరీశ్ శంకర్, సురేందర్ రెడ్డిలతో సినిమాలను కూడా లైన్‌లో పెట్టుకున్నాడు. ఇవి ఇంకా మొదలు కాకముందే ఇప్పుడు 'సాహో' ఫేం సుజిత్‌తో కూడా ఓ ప్రాజెక్టును ఇటీవలే ప్రకటించాడు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమా గ్యాంగ్‌స్టర్ స్టోరీతో తెరకెక్కబోతుందని చిత్ర యూనిట్ పోస్టర్ ద్వారా వెల్లడించింది. అంతేకాదు, OG (ఓరిజినల్ గ్యాంగ్‌స్టర్) అంటూ సినిమాపై ఓ హిట్ కూడా ఇచ్చేసింది. దీంతో దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి.

 Anirudh Ravichander Rejects Pawan Kalyan and Sujeeth Movie

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు పని చేయబోయే మ్యూజిక్ డైరెక్టర్ గురించి కూడా ప్రచారాలు మొదలయ్యాయి. దీంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అనిరుధ్ రవిచందర్‌ను తీసుకోమని రిక్వెస్టులు చేస్తున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ముందుగా చిత్ర యూనిట్ అనిరుధ్‌తోనే సంప్రదింపులు జరిపిందట. కానీ, డేట్స్ ఖాళీ లేని కారణంగా అతడు ఈ ఆఫర్‌ను రిజెక్ట్ చేశాడని తెలిసింది. దీంతో జిబ్రాన్‌ను ఎంపిక చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది.

 Anirudh Ravichander Rejects Pawan Kalyan and Sujeeth Movie

ఇక, సుజిత్ డైరెక్షన్ పవన్ కల్యాణ్ నటించబోయే సినిమాను వచ్చే జనవరిలో మొదలు పెట్టబోతున్నట్లు ఫిలిం నగర్ ఏరియాలో టాక్ నడుస్తోంది. అంతేకాదు, ఈ చిత్రాన్ని కేవలం ఆరు నెలల లోపే పూర్తి చేయబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇక, ఈ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X