NTR30: ఫొటోతో సర్‌ప్రైజ్ చేసిన అనిరుధ్.. తారక్ ఫ్యాన్స్‌కు పూనకాలు ఖాయం
నందమూరి ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి వచ్చి.. చాలా తక్కువ టైంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని.. సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో స్టార్‌గా హవాను చూపిస్తున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఈ మధ్య కాలంలో వరుసగా 'టెంపర్', 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత.. వీరరాఘవ' వంటి సూపర్ డూపర్ హిట్లను ఖాతాలో వేసుకున్న అతడు.. RRR (రౌద్రం రణం రుధిరం) మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. దీంతో జూనియర్ ఎన్టీఆర్‌లో ఉత్సాహం రెట్టింపు అయింది.
పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ చాలా రోజుల క్రితమే తన 30వ చిత్రాన్ని బడా డైరెక్టర్ కొరటాల శివతో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు ప్రకటించాడు. ఆ తర్వాత దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడింది. కానీ, ఈ సినిమా అనుకున్న సమయానికి మాత్రం ప్రారంభం కాలేదు. దీంతో అసలు ఈ ప్రాజెక్టు ఉంటుందా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితమే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన గ్లిమ్స్ వీడియోను రిలీజ్ చేశారు. అలాగే, ఇటీవలే ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో ఈ ప్రాజెక్టు త్వరలోనే మొదలవుతుందని క్లారిటీ వచ్చింది.

జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రానికి కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా అతడు దీనికి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్‌ను డైరెక్టర్‌తో కలిసి మొదలు పెట్టేశాడు. ఈ మేరకు ఈ విషయాన్ని తెలుపుతూ ఓ ఫొటోను ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. అంతేకాదు, 'ఈ సినిమా చాలా ప్రత్యేకం కాబోతుంది' అంటూ ఫ్యాన్స్‌లో అంచనాలకు కూడా పెంచేశాడు. ఫలితంగా అనిరుధ్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అయిపోతోంది.
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ రూపొందిస్తోన్న ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతుంది. ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ అనిరుథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇది హిస్టారికల్ స్టోరీతో రూపొందనుందనే టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











