Devara మూవీ గ్లింప్స్‌పై అనిరుథ్ ట్వీట్.. ఫ్యాన్స్‌కు రక్తం ఉరకలెత్తేలా!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ మధ్య కాలంలో హై రేంజ్ మూవీలు చాలానే వస్తున్నాయి. కానీ, అందులో చాలా తక్కువ చిత్రాలు మాత్రమే ఆరంభంలోనే హైప్‌ను క్రియేట్ చేసుకుని సెన్సేషన్ అవుతున్నాయి. అలాంటి వాటిలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'దేవర' (Devara) ఒకటి. ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్న విషయం తెలిసిందే.

'జనతా గ్యారేజ్' వంటి క్రేజీ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న సినిమానే 'దేవర'. కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోన్న ఈ మూవీని రెండు భాగాలుగా రూపొందిస్తోన్నారు. అందులో మొదటి పార్టుకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇలా ఇప్పటికే 80 శాతానికి పైగానే టాకీ పార్టును కంప్లీట్ చేశారు.

Recommended Video

Devara Teaser BGM పై Anirudh Comments.. All Hail The Tiger | Telugu Filmibeat

Anirudh Ravichander Tweet Increase Hype On Devara Movie Glimpse

ఫుల్ ఫామ్‌లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న 'దేవర' మూవీపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీని నుంచి ఇప్పటికే కొన్ని పోస్టర్లు వచ్చాయి. కానీ, దీని నుంచి బిగ్ అప్‌డేట్ కోసం నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఆసక్తికరంగా వేచి చూస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో తెరకెక్కుతోన్న 'దేవర' మూవీ నుంచి త్వరలోనే గ్లింప్స్ వీడియోను విడుదల చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే దీన్ని జనవరి 8వ తేదీన వదలబోతున్నట్లు వార్తలు వచ్చాయి. వీటిని నిజం చేస్తూ తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ రవిచందర్ ఈ అప్‌డేట్‌పై ట్వీట్ చేసి అంచనాలను పెంచేశాడు.

అనిరుథ్ రవిచందర్ తాజాగా తన ట్విట్టర్‌లో 'దేవర టీజర్ సూపర్‌గా ఉంది. తారక్ అండ్ కొరటాల శివ ఫైర్ చూపిస్తారు. చాలా ఆసక్తిగా ఉన్నాను' అని రాసుకొచ్చాడు. దీన్ని నిర్మాణ సంస్థ రీట్వీట్ చేస్తూ.. 'అనిరుథ్ దీని గురించి ఇలా చెప్పాడంటే.. ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి' అని చెప్పింది. మొత్తానికి 'దేవర' అప్‌డేట్‌పై హైప్‌ను భారీగా పెంచేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న 'దేవర' మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇందులో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X