NTR30: పని మొదలెట్టబోతున్న టాప్ టెక్నీషియన్.. షూట్ కంటే ముందే కంప్లీట్

నందమూరి ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి వచ్చినా.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని.. చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగిపోయాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఆరంభంలోనే పలు ఇండస్ట్రీ హిట్లను కూడా ఖాతాలో వేసుకున్న అతడు.. ఆ తర్వాత చాలా కాలం పాటు వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడ్డాడు. కానీ, ఈ మధ్య కాలంలో తారక్.. వరుసగా 'టెంపర్', 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత.. వీరరాఘవ' వంటి సూపర్ డూపర్ హిట్లను ఖాతాలో వేసుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలను లైన్‌లో పెట్టుకుంటూ దూసుకుపోతోన్నాడు.

విజయాల పరంపరతో తన కెరీర్‌లో భీకరమైన ఫామ్‌లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్.. ఈ మధ్యనే RRR (రౌద్రం రణం రుధిరం) అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ మూవీ సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. అంతేకాదు, అత్యధిక కలెక్షన్లను రాబట్టి ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను కూడా క్రియేట్ చేసుకుంది. ఈ ఉత్సాహంతోనే యంగ్ టైగర్ తన తదుపరి చిత్రాన్ని బడా డైరెక్టర్ కొరటాల శివతో చేయబోతున్నాడు. అయితే, ఈ సినిమా అనుకున్న సమయానికి ప్రారంభం కావడం లేదు. దీంతో ఈ సినిమా అసలు ఉంటుందా? ఉండదా అన్న సందేహాలు వెల్లువెత్తుతోన్న విషయం తెలిసిందే.

Anirudh To Starts Working for NTR and Koratala Shiva Movie

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కలయికలో 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ మూవీ వచ్చింది. దీని తర్వాత వస్తున్న ప్రాజెక్టుపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా నుంచి ఎన్నో రకాల ఆసక్తికరమైన విషయాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఇక, ఈ సినిమా జూలై నుంచి రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోబోతుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. కానీ, ఈ సినిమా మాత్రం అస్సలు ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో ఇటీవలే దీని నుంచి గ్లిమ్స్ వీడియోను వదిలారు. దీంతో ఈ సినిమా ఎప్పటికైన ప్రారంభం అవుతుందని పరోక్షంగా చెప్పనట్లైంది. దీని కోసం వాళ్ల అభిమానులు మాత్రం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్.. కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎవరిని తీసుకోబోతున్నారన్న దానిపై ఆరంభంలో ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో దీనికి తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన అనిరుధ్ రవిచందర్‌ను తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు, కొద్ది రోజుల క్రితం వచ్చిన గ్లిమ్స్ వీడియోకు అతడు అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఇచ్చాడు. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్ సినిమా కోసం అనిరుధ్ త్వరలోనే మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభించబోతున్నాడట. ఈ మేరకు అతడు అన్ని రకాల పనులను పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడని తెలిసింది. అంటే సినిమా షూట్ మొదలు కాకుండానే ఈ మ్యూజిక్ డైరెక్టర్ తన పని పూర్తి చేయబోతున్నాడు.

Anirudh To Starts Working for NTR and Koratala Shiva Movie

భారీ బడ్జెట్‌తో రాబోయే ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది. పల్లెటూరి నుంచి వచ్చిన యువకుడు దేశం మొత్తాన్ని మార్చేలా ఇచ్చే సందేశంతో ఇది రూపొందుతోందట. ఇక, ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ అనిరుథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X