Just In
- 17 min ago
మనం 2లో మరో ఇద్దరు యువ హీరోలు.. స్టోరీ ఎంతవరకు వచ్చిందంటే?
- 26 min ago
విడుదలకు ముందే బయటకు: ‘ఆచార్య’ టీజర్ హైలైట్స్ ఇవే.. చివరి ఐదు సెకెన్స్ అరాచకమే!
- 1 hr ago
అల్లు అర్జున్ ‘పుష్ప’ రిలీజ్ డేట్ ప్రకటన: అదిరిపోయిన కొత్త పోస్టర్.. ఆ రూమర్లకు కూడా చెక్
- 1 hr ago
‘రాధే శ్యామ్’ టీజర్ డేట్ ఫిక్స్: అదిరిపోయే స్పెషల్ డేను లాక్ చేసిన ప్రభాస్
Don't Miss!
- News
మదనపల్లె కేసు రిమాండ్ రిపోర్ట్ లో షాకింగ్ అంశాలు .. పూజ గదిలో బూడిద, కత్తిరించిన జుట్టు, గాజు ముక్కలు
- Sports
టీమిండియా ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగింది.. ఓడించడం కష్టమే: ఇంగ్లండ్ మాజీ కోచ్
- Automobiles
ఇండియా To సింగపూర్ : బస్‌లో వెళ్లి వచ్చేద్దామా.. మీరు విన్నది నిజమే.. చూడండి
- Finance
Gold prices today: వరుసగా 5వ రోజు తగ్గిన బంగారం ధరలు, రూ.7500 తక్కువ
- Lifestyle
తక్కువ సమయంలో చర్మాన్ని క్లియర్ చేయడానికి ఉపయోగించే ముందు ఇది తెలుసుకోవాలి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హాట్‌హాట్‌గా రాయ్ లక్ష్మీ.. అంజలితో కలిసి ఆనందభైరవి
అందాల తారలు అంజలి, రాయ్ లక్ష్మీ హీరోయిన్లుగా ఆదిత్ అరుణ్ ప్రత్యేక పాత్రలో "ఆనంద భైరవి" చిత్రాన్ని హరివేన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత ఇటికేల రమేష్‌రెడ్డి రూపొందిస్తున్నారు. యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి కర్రీ బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ వైజాగ్ పరిసర ప్రాంతాల్లో పూర్తి చేసుకుంది..
ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత ఇటికేల రమేష్ రెడ్డి మాట్లాడుతూ మాట్లాడుతూ.. అందమైన విశాఖపట్నంలో ఓ అందమైన జంట అంజలి, ఆదిత్ అరుణ్‌లపై దర్శకుడు కర్రీ బాలాజీ చిత్రీకరించిన ప్రేమ సన్నివేశాలు ఆహ్లాదకరంగా ఉన్నాయి.. పృథ్వీ, బహ్మాజి, గుండు సుదర్శన్, జయవాణి లపై చిత్రీకరించిన కామెడీ సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయి.. భారీ వ్యయంతో ఎక్కడా రాజీ పడకుండా ఈ షెడ్యూల్ ని తీశామని, తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఉంటుంది అని అన్నారు.
దర్శకుడు కర్రీ బాలాజీ మాట్లాడుతూ.. ఆనందిని పాత్రలో అంజలి ఒదిగిపోయారు, ఆ పాత్ర కోసం అంజలి చాలా వర్కవుట్స్ చేసి బాగా సన్నపడ్డారు. ఆనందిని పాత్రని అంజలి ప్రేమించిన విధానం, ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిగా తన హావభావాల్ని ఆ పాత్రలో ప్రదర్శిస్తున్నప్పుడు చూసి ఆశ్చర్య పోయాను. ఆనందిని పాత్ర కోసం స్కూటీ రైడ్ చేస్తున్న సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు స్కూటీ కిందపడి ఆమెకు గాయాలయ్యాయి, అయినా సరే లెక్క చేయకుండా షూటింగ్ లో పాల్గొనడం తో ఆమెకు వర్క్ పట్ల ఉన్న దీక్షని చూసి ఆమెకు ఫ్యాన్ అయిపోయాను.. ఆమె సరసన ఆదిత్అరుణ్ ముచ్చటగా ఉన్నాడు, ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చూస్తే ఈ చిత్ర యొక్క విజయం నా కాళ్ళ ముందు కనిపిస్తుంది అని అన్నారు.

ఆనంద బైరవి చిత్రానికి కెమెరా మెన్ పీజీ విందా పనితనం, మణిశర్మ మ్యూజిక్, నిర్మాత రమేష్ రెడ్డి గారి ప్రోత్సాహం నన్ను మరింత ముందుకు నడిపించాయి. తదుపరి జరిగే షెడ్యూల్‌లో లక్ష్మీ రాయ్‌పై యాక్షన్ సన్నివేశాల్ని చిత్రీకరించడానికి ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తున్నాను అని బాలాజీ అన్నారు..
నటీనటులు:
అంజలి, లక్ష్మీ రాయ్, ఆదిత్ అరుణ్, సుమన్, బ్రహ్మాజీ, మురళి శర్మ, జయప్రకాశ్, కళ్యాణి, ఆశిష్ విద్యార్థి, పృథ్వీ, గుండు సుదర్శన్, జయవాణి, గిరి, మణిచందన, ప్రభాస్ శ్రీను, సుబ్బరాయ శర్మ, ధన్ రాజ్, ఐశ్వర్య, విద్యుల్లేఖరామన్, బాహుబలి ప్రభాకర్, ఛత్రపతి శేఖర్, పర్వీన్ రాజ్, దినేష్, రాహుల్, సాత్విక్, కె . శ్రీ హర్ష తదితరులు.
సాంకేతిక నిపుణులు:
స్కిప్ట్ కో ఆర్డినేటర్: మధు విప్పర్తి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సురేష్ దత్తి
ఎడిటింగ్: చోట కె ప్రసాద్
కెమెరా: పీజీ విందా
మ్యూజిక్: మణిశర్మ
ప్రొడ్యూసర్: ఇటికేలా రమేష్ రెడ్డి
కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం: కర్రీ బాలాజీ