NBK107: బాలయ్య సరసన తెలుగు హీరోయిన్.. అందరినీ అడిగి చివరకు ఆమెనే ఫిక్స్ చేశారట

తెలుగు సినీ ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేసే హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు. అందులో సీనియర్ స్టార్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ ఒకరు. దాదాపు నలభై ఏళ్లుగా టాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్న ఆయన.. ఇదే పంథాను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలను సైతం సొంతం చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో ఈ సీనియర్ హీరో.. వరుస పరాజయాలతో ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఒకటి పట్టాలపై ఉండగానే మరొకటి అన్నట్లు వరుస పెట్టి ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూనే ఉన్నారు.

ఫ్లాపుల పరంపరతో సతమతం అవుతోన్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ' అనే సినిమాను చేస్తున్నారు. 'సింహా', 'లెజెండ్' వంటి రెండు భారీ విజయాల తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో పవర్‌ఫుల్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. పూర్ణ, శ్రీకాంత్ నెగెటివ్ రోల్స్ చేస్తున్నారు. థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఇది త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Anjali Fix for Nandamuri Balakrishna and Gopichand Malineni Movie

'అఖండ' మూవీ పట్టాలపై ఉండగానే బాలకృష్ణ.. గోపీచంద్ మలినేనితో ఓ సినిమాను ప్రకటించాడు. ఈ ఏడాది ఆరంభంలోనే 'క్రాక్'తో భారీ సక్సెస్‌ను అందుకున్న ఈ దర్శకుడు.. ఆ వెంటనే బాలయ్య కోసం మరో పవర్‌ఫుల్ సబ్జెక్టును రెడీ చేసేశాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమా ఫ్యాక్షన్ నేపథ్యంతో రాబోతుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఈ సినిమా ఎంతో పవర్‌ఫుల్‌గా తెరకెక్కనుందనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఏర్పడుతున్నాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయని సమాచారం.

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ సరసన కోలీవుడ్ హాట్ బ్యూటీ శృతి హాసన్ నటిస్తుందని ఆ మధ్య ఓ న్యూస్ తెగ వైరల్ అయింది. అయితే, ఆ తర్వాత ఇందులో ఆమె నటించడం లేదన్న టాక్ కూడా వినిపించింది. దీంతో సదరు దర్శకుడు వేరే హీరోయిన్ కోసం అన్వేషణ కొనసాగిస్తున్నాడని కూడా జోరుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం కోసం తెలుగు హీరోయిన్ అంజలిని తీసుకున్నారని ఓ న్యూస్ బయటకు వచ్చింది. అయితే, ఇది హీరోయిన్ పాత్ర కోసమా? లేక వేరే ఏదైనా రోల్ చేయడానికా? అన్నది మాత్రం తెలియడం లేదు.

బాలయ్యతో చేసే ఈ సినిమా కోసం నిజ జీవిత సంఘటనల ఆధారంగా కథను రెడీ చేశాడీ యంగ్ డైరెక్టర్. పల్నాడు నేపథ్యంతో సాగే ఈ సినిమా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతుందట. ఇక, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. అలాగే, యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్నాడని ఈ మధ్యనే ఓ న్యూస్ బయటకు వచ్చింది. అలాగే, వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఇందులో కీలక పాత్రను చేస్తుందన్న టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X