పవన్ మూవీలో ముగ్గురు హీరోయిన్లు.. ఇద్దరు ఫిక్స్.. మరి ఆమె ఒప్పుకుంటుందా!
ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్న విషయాల్లో పవర్ స్టార్ పవన్ కల్యాన్ రీఎంట్రీ వార్త ఒకటి. రెండు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ హీరో.. రాజకీయాల్లోకి ఎంటర్ అవడంతో సినిమాలకు దూరమయ్యారు. దీంతో ఆయన అభిమానులు నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ మరోసారి సినిమాల్లోకి వస్తున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగిపోయాయి. తాజాగా ఈ సినిమా గురించి ఓ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటది..?

అనుకున్నది సాధించిన బడా నిర్మాత
పవన్ కల్యాణ్‌తో సినిమా చేయాలని ఏ నిర్మాత మాత్రం అనుకోడు. ఈ జాబితాలో బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా ఉన్నారు. ఆయన ఎప్పటి నుంచో పవర్ స్టార్‌తో సినిమా చేయాలని ప్లాన్ చేస్తూనే ఉన్నారు. అది ఇన్నాళ్లకు వర్కౌట్ అయింది. బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ‘పింక్' సినిమా తెలుగు రీమేక్ ద్వారా ఈ కాంబినేషన్ పట్టాలెక్కేసింది.

పవన్ లేకుండానే షురూ చేసేశారు
పవర్ స్టార్ ‘పింక్' రీమేక్‌లో నటిస్తారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు రహస్యంగా నిర్వహించారు చిత్ర యూనిట్ సభ్యులు. గురువారం దిల్ రాజు ఆఫీస్‌లో ఈ కార్యక్రమం జరిగింది. దీనికి మీడియాను దూరంగా ఉంచారు. ఇంకో విషయం ఏంటంటే.. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ కూడా హాజరు కాలేదు.

థమన్ ప్రకటనతో క్లారిటీ వచ్చేసింది
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ శుక్రవారం ఓ ట్వీట్ చేశాడు. ఇందులో ‘ఈ హీరో గారితో బిగ్ జర్నీ ప్రారంభం అయింది. దిల్ రాజు గారితో మూడో సినిమా, వేణు శ్రీరామ్ గారితో మొదటిది స్టార్ట్ చేశాను. మా మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా ఈరోజే మొదలయ్యాయి' అని పేర్కొన్నాడు. దీంతో పవన్ కల్యాణ్ సినిమా ప్రారంభం అయిపోయిందని అందరికీ క్లారిటీ వచ్చేసింది.

పవన్ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు
ఈ సినిమాలో నటించే హీరోయిన్ల గురించి తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ‘పింక్' తెలుగు రీమేక్‌లో ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారట. వాస్తవానికి మాతృకలో కూడా ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. ఈ ముగ్గురి నటనకు మంచి మార్కులే పడ్డాయి. మూడు పాత్రలకూ ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకే పవన్ సినిమాకు కూడా టాలెంటెడ్ హీరోయిన్లను ఎంపిక చేస్తారట.

ఇద్దరు ఫిక్స్.. ఆమె కోసం వెయిటింగ్
పింక్ తెలుగు రీమేక్‌లో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని అనుకుంటున్న నేపథ్యంలో ఓ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఇప్పటికే ఓ పాత్రకు నివేదా థామస్‌ను ఎంపిక చేశారు. మరో పాత్రకు తెలుగు నటి అంజలిని తీసుకున్నారని తాజాగా ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. ఇక, మూడో హీరోయిన్ కోసం మాతృకలో నటించిన తాప్సీని సంప్రదిస్తోందట చిత్ర యూనిట్.


Click it and Unblock the Notifications











