twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అంజలి, లక్ష్మీరాయ్ కాంబినేషన్లో ‘ఆనంద‌భైర‌వి’

    |

    హీరోయిన్ అంజ‌లి ప్ర‌ధాన పాత్ర‌లో త్వరలో మరో చిత్రం ప్రారంభం కాబోతోంది. 'ఆనంద‌భైర‌వి' టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రంలో ల‌క్ష్మీరాయ్ ప్ర‌త్యేక పాత్ర పోషించ‌బోతున్నారు. యువ ద‌ర్శ‌కుడు క‌ర్రి బాలాజీ ద‌ర్శ‌క‌త్వంలో హ‌రేవ‌న్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకం‌పై ర‌మేశ్‌రెడ్డి ఇటికెల ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు.

    ఈ సినిమా గురించి నిర్మాత ర‌మేశ్‌రెడ్డి మాట్లాడుతూ ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ నాకు బాగా న‌చ్చింది. ప్రేక్షకులు కోరుకొనే అన్ని అంశాలూ అందులో ఉంటాయి. డిసెంబ‌ర్‌లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా షూటింగ్ ప్రారంభించి, జ‌న‌వ‌రి నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ జరిపేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. అంజలికి జోడీగా ఒక యువ హీరోను ఎంపిక చేయబోతున్నట్లు తెలిపారు.

    Anjali, Lakshmi Rai Working together for new movie Ananda Bhairavi

    ద‌ర్శ‌కుడు క‌ర్రి బాలాజీ మాట్లాడుతూ స‌మాజంలో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకొంటుంది. హైద‌రాబాద్‌, వైజాగ్‌, కేర‌ళ‌లోని ప‌లు అంద‌మైన లొకేష‌న్ల‌లో షూటింగ్ చేస్తాం. వినోదం, ఉల్లాసం ఉంటూ ఉత్కంఠ‌భ‌రితంగా సినిమా సాగుతుంది. ముఖ్యంగా అంజ‌లి పాత్ర ప్ర‌తి ఇంట్లో ఉండే అమ్మాయిని గుర్తు చేసేలా ఉంటుంది అని చెప్పారు.

    అంజ‌లి మాట్లాడుతూ ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ న‌చ్చి ఈ సినిమా చేస్తున్నాను. తొలిసారిగా యాక్ష‌న్ పాత్ర పోషిస్తున్నాను. సినిమాలోని యాక్ష‌న్ స‌న్నివేశాల కోసం ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ తీసుకుంటున్నాను అని చెప్పారు.

    సినిమాలో ప్ర‌త్యేక పాత్ర పోషిస్తున్న ల‌క్ష్మీరాయ్ మాట్లాడుతూ.. 'ఇందులో నేను ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నాను. ఇంత‌వ‌ర‌కూ నేను చేసిన పాత్ర‌ల‌కు భిన్నంగా ఉంటుంది. న‌టించ‌డానికి బాగా స్కోప్ ఉన్న పాత్ర చేస్తున్నందుకు ఆనందంగా ఉంది అన్నారు.

    Anjali, Lakshmi Rai Working together for new movie Ananda Bhairavi

    ర‌వికిష‌న్‌, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్‌, ధ‌న్‌రాజ్‌, స‌త్యం రాజేశ్‌, ఆశిష్ విద్యార్ధి, బ్ర‌హ్మాజీ, శ్రీ‌హ‌ర్ష త‌దిత‌రులు న‌టించే ఈ చిత్రానికి స్క్రిప్ట్ కో-ఆర్డినేట‌ర్: మ‌ధు వనపర్తి, సంగీతం: మ‌ణిశ‌ర్మ‌, ఛాయాగ్ర‌హ‌ణం: పి.జి.విందా, ఎడిటింగ్: చోటాకె. ప్ర‌సాద్‌, ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్: ప‌రిటాల రాంబాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: సురేశ్‌బాబు ద‌త్తి, నిర్మాత: ర‌మేశ్‌రెడ్డి ఇటికెల‌, క‌థ‌, స్ర్కీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: క‌ర్రిబాలాజీ.

    English summary
    Actress Anjali, Lakshmi Rai Working together for new movie "Ananda Bhairavi". The movie directed by Karri Balaji, Produced by Ramesh Reddy Itikela.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X