twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిశ్శబ్దం.. అంజలి పవర్‌ఫుల్‌ క్రైం డిటెక్టివ్‌.. లుక్ అదిరింది

    |

    చూడచక్కని అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న అంజలి ఈ సారి పవర్‌ఫుల్ రోల్‌తో పరేషాన్ చేయబోతోంది. గతంలో ''సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బలుపు, గీతాంజలి, చిత్రంగద'' లాంటి సినిమాలతో మెప్పించిన ఆమె.. ఇప్పుడు 'నిశ్శబ్దం' సినిమాతో అలరించేందుకు రెడీ అవుతోంది.

    హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమా నుంచి తాజాగా అంజలి లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. అమెరికా బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతున్న సైలెన్స్ సినిమాలో అంజ‌లి పవర్‌ఫుల్‌ క్రైం డిటెక్టివ్‌ ఏజెంట్‌ 'మహా'గా కనిపించనున్నట్లుగా చిత్ర యూనిట్ పేర్కొంది. లుక్ పరంగా అదరగొడుతున్న అంజలిని చూసి ఫిదా అవుతున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.

    Anjali Look Out From Anushka Shettys Silence

    కోన వెంకట్, టీజీ విశ్వ‌ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అనుష్క లీడ్ రోల్ పోషిస్తోంది. భాగమతి తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ఆమె సరికొత్తగా మూగ చిత్రకారిణి సాక్షి పాత్రలో నటిస్తోంది. అలాగే మాధ‌వ‌న్, షాలినిపాండే, సుబ్బ‌రాజ్, అవసరాల శ్రీనివాస్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో నటిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. చిత్రాన్ని తెలుగుతో పాటు త‌మిళ, ఇంగ్లీషు, హిందీ, మ‌ల‌యాళం భాష‌ల్లో భారీ స్ధాయిలో రిలీజ్ చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నారు.

    ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అనుష్క, మాధవన్‌ లుక్స్‌, ప్రీ టీజర్ విడుదల చేసిన చిత్రయూనిట్ మంచి స్పందన తెచ్చుకుంది. నవంబరు 7న అనుష్క పుట్టినరోజు సందర్భంగా మరో టీజర్‌ రిలీజ్‌ చేయబోతున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 24న విడుదల చేయబోతున్నారని టాక్.

    English summary
    After long gap of Bhagamathi Anushka starts a new movie Nishabdam. This movie shooting started in America. In this movie Anjali played a importent role.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X