ఎన్నడూ చూడని 3డీ దెయ్యం.. లీసాగా అంజలి.. 24న ప్రేక్షకుల ముందుకు
దర్శకుడు రాజు విశ్వనాథ్ తెరకెక్కించిన లీసా 3డి చిత్రం తాజా వేసవి సీజన్‌లో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టడం ఖాయమనే ధీమా వ్యక్తమవుతున్నది. ఈ చిత్రాన్ని తెలుగులో వీరేష్ కాసాని సమర్పణలో ఎస్‌కే పిక్చర్స్ సంస్థ రిలీజ్ చేస్తున్నది. త్వరలో ఆడియో, ట్రైలర్లను విడుదల చేసి, మూవీని ఈ నెల 24న విడుదల చేస్తామని నిర్మాత సురేష్ కొండేటి తెలిపారు.
దర్శకుడు రాజు విశ్వనాథ్ మాట్లాడుతూ..దెయ్యం సినిమాలకు క్రేజ్ తగ్గిందనే సమయంలో లీసా మూవీ వస్తున్నది. తప్పుకుండా చక్కటి అనుభూతిని కలిగించడం గ్యారెంటీ. అన్ని దెయ్యాల సినిమాల్లా రొటీన్‌గా ఉండదు. రెగ్యులర్ ఫార్మాట్‌లో కాకుండా 3డిలో డిఫరెంట్‌గా ప్రయత్నించిన చిత్రమిది. నాణ్యమైన విజువల్స్ కోసం 8కే ఫార్మాట్‌లో తెరకెక్కించి 2కే ఫార్మాట్‌కి మార్చాం. సినిమాటోగ్రఫర్ పీజీ ముత్తయ్య ఈ చిత్రాన్ని విజువల్స్ వండర్‌గా చూపించారు. అంజలి నటన సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది. నటీనటులు ఫెర్ఫార్మెన్స్, స్క్రీన్ స్క్రీన్ ప్లే ప్రేక్షకులను కట్టిపడేస్తుంది అని అన్నారు.

నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ.. షాపింగ్ మాల్, జర్నీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఎస్‌కే పిక్చర్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు అందించాం. అంజలి నటించిన ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. ఆ సినిమాలను ఎంతో అద్భుతంగా ఆదరించిన ప్రేక్షకులు అలాగే ఈ లీసా త్రీడి సినిమాని ఆదరిస్తారన్న నమ్మకం ఉంది. తెలుగులో పూర్తిగా షూటింగ్ చేసిన చిత్రమిది. డిజిటల్ రూపంలో త్రీడీలో విడుదలవుతున్న మొట్టమొదటి హారర్ చిత్రంగా రికార్డులకెక్కుతోంది. ఈ సమ్మర్ కానుకగా పిల్లలు కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేసే పూర్తి వినోదాత్మక చిత్రమిది. ముఖ్యంగా 3డి దెయ్యం గగుర్పాటుకు గురి చేయడం గ్యారెంటీ. మే 24న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం అని అన్నారు.

సినిమాటోగ్రాఫర్: పి.జి.ముత్తయ్య
మ్యూజిక్ డైరెక్టర్: సంతోష్ దయానిధి
ఎడిటర్ :ఎస్ ఎన్ ఫాజిల్
స్టంట్ మాస్టర్: స్టన్నర్ సామ్
కోరియోగ్రఫీ: సురేష్
ఆర్ట్ డైరెక్టర్: వినోద్
నిర్వహణ : , శ్రీనివాస్ గొండేల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చంద్రహాస్ ఇప్పలపల్లి
సమర్పణ కాసాని వీరేశ్
నిర్మాత సురేష్ కొండేటి
కథ-డైరెక్షన్: రాజు విశ్వనాథ్


Click it and Unblock the Notifications











