For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నితిన్ కోసం తెలుగు హీరోయిన్ ఐటమ్ సాంగ్: రేపే అసలైన ప్రకటన

  |

  సుదీర్ఘ కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస చిత్రాలతో సత్తా చాటుతోన్న యంగ్ హీరోల్లో యూత్ స్టార్ నితిన్ ఒకడన్న విషయం తెలిసిందే. 'జయం' అనే సినిమాతో హీరోగా పరిచయం అయిన ఈ కుర్రాడు.. గ్రాండ్ ఎంట్రీని దక్కించుకున్నాడు. ఆ తర్వాత కూడా ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను దక్కించుకున్నాడు. అయితే, మధ్యలో వరుస పరాజయాలతో కెరీర్‌ను ప్రశ్నార్థకం చేసుకున్న తరుణంలో 'ఇష్క్'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. అక్కడి నుంచి కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటూ చక్కటి చిత్రాలను అందిస్తున్నాడు. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం నితిన్ 'భీష్మ' అనే భారీ హిట్‌ను అందుకున్నాడు.

  లేటు వయసులో రెచ్చిపోయిన సుస్మితా సేన్: స్విమింగ్ పూల్‌లో అందాల ఆరబోత

  'భీష్మ' హిట్ ఇచ్చిన ఉత్సాహంతో హీరో నితిన్ రెట్టించిన జోష్‌తో ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నాడు. ఇందులో భాగంగానే గత ఏడాది ఏకంగా 'చెక్', 'రంగ్ దే', 'మాస్ట్రో' వంటి మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వీటిలో మొదటి రెండు థియేటర్లలో విడుదలయ్యాయి. కానీ, అక్కడ ఈ చిత్రానికి రెస్పాన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో దక్కలేదు. ఫలితంగా ఈ రెండు మూవీలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. ఇక, 'మాస్ట్రో' మాత్రం నేరుగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజ్ అయింది. దీనికి మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ దక్కింది. ఫలితంగా ఈ మూవీ మంచి సక్సెస్ అయింది.

  హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరో నితిన్.. ప్రస్తుతం 'మాచర్ల నియోజకవర్గం' అనే సినిమా చేస్తున్నాడు. ఎమ్మెస్ రాజశేఖర్ రెడ్డి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. అయితే, మధ్యలో అనుకోని అవాంతరాలు ఎదురు కావడంతో ఈ సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోయారు. దీంతో ముందుగా ప్రకటించిన డేట్‌కు ఈ చిత్రాన్ని తీసుకు రాలేదు. ఇక, ఇటీవలే దీనికి సంబంధించిన టాకీ పార్టును కంప్లీట్ చేసుకున్నారని తెలుస్తోంది. దీంతో చిత్ర యూనిట్ ప్రచారం చిత్రాలను విడుదల చేయాలని భావిస్తోంది.

  Bigg Boss 6: బిగ్ బాస్‌లోకి టాలీవుడ్ లవర్ బాయ్.. అప్పుడు మిస్సైనా ఈ సారి కన్ఫార్మ్‌!

  Anjali Special Song in Macherla Niyojakavargam Movie

  క్రేజీ సబ్జెక్టుతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'మాచర్ల నియోజకవర్గం' మూవీలో తెలుగు హీరోయిన్ అంజలి స్పెషల్ సాంగ్‌ను చేసినట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు ఓ అదిరిపోయే పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది. ఇందులో అంజలి హాట్ ఫోజుతో కుర్రాళ్లను రెచ్చగొట్టేలా ఉంది. ఇక, ఈ సాంగ్‌కు సంబంధించిన ప్రకటన సోమవారం రాబోతుందని కూడా చిత్ర యూనిట్ పేర్కొంది. దీంతో ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్‌పై అందరిలోనూ అంచనాలు పెరిగిపోయాయి. అదే సమయంలో దీని కోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పూర్తైన ఈ పాట అదిరిపోయేలా వచ్చిందనే టాక్ వినిపిస్తోంది.

  'మాచర్ల నియోజకవర్గం' మూవీని ఎమ్మెస్ రాజశేఖర్ రెడ్డి తెరకెక్కిస్తోన్నాడు. ఇందులో కృతి శెట్టి, కేథరిన్ థ్రెస్సా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ జిల్లా కలెక్టర్ పాత్రను పోషిస్తున్నాడు. ఇక, ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై ఆదిత్య మూవీస్ ఎంటర్‌టైన్‌మెంట్ భాగస్వామ్యంలో సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మహతీ స్వర సాగర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 12న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.

  English summary
  Youth Star Nithiin Now Doing Macherla Niyojakavargam Movie Under M.S. Rajashekhar Reddy Direction. Anjali Did Special Song in This Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X