twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మీరాభాయి పతకం సాధిస్తే... ఈశాన్య భారతం గుర్తొస్తుందా?.. అంకితా కన్వర్ ఘాటైన వ్యాఖ్యలు

    |

    ఈశాన్య రాష్ట్రాలకు చెందిన మీరాభాయ్ ఛాను టోక్యో ఒలంపిక్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ క్రీడలోని 49 కేజీల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించడంతో ఆమె పేరు మార్మోగింది. దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు మీరాభాయ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో నటుడు, మోడల్ మిలింద్ సోమన్‌తో సహజీవనం చేస్తున్న అంకితా కన్వర్ ఘాటుగా స్పందించారు. ఈశాన్య రాష్ట్రాలపై కొనసాగుతున్న వివక్షను ఎండగట్టారు. అయితే అంకితా కన్వర్ ఎలా స్పందించారంటే..

    మీరా భాయ్ ఛానుపై ప్రశంసలు కురుస్తున్న నేపథ్యంలో అంకితా ట్వీట్ చేస్తూ... దేశానికి ఏదైనా పతకం సాధిస్తే తప్ప ఈశాన్య రాష్ట్రాలు గుర్తుకు రాదు. ఇది దేశంలో పక్షపాత ధోరణికి తార్కాణం. ఈశాన్య రాష్ట్రాల ప్రజలను రకరకాల పేర్లతో పిలుస్తూ చిన్న చూపుత చూస్తుంటారు. చింకీ, చైనీస్, నేపాలీ, కరోనా అనే పేర్లతో కించ పరుస్తుంటారు దేశంలోనే కులపిచ్చే కాదు.. జాతి వివక్ష కూడా ఎక్కువే. స్వంత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్న వ్యాఖ్యలు అంటూ అంకితా కన్వర్ అన్నారు.

    Ankita Konwars Racism tweet goes viral amid Mirabai Chanu wins Silver medal in Olympics

    అంకితా కన్వర్ ట్వీట్‌పై పలు రకాల కామెంట్లు నెటిజన్ల నుంచి వచ్చాయి. ఆమెను మిలింద్ సోమన్ భార్య అంటూ కామెంట్ చేస్తూ నెటిగివ్ అప్రోచ్ మానుకోవాలని నెటిజన్లు కామెంట్ చేశారు.

    మోడల్ మిలింద్ సోమన్‌తో డేటింగ్ చేసిన అంకితా చివరకు 2018లో పెళ్లి చేసుకొన్నారు. ప్రస్తుతం మిలింద్‌తో కలిసి ముంబైలో ఉంటున్నారు

    English summary
    Millind Soman wife Ankita Konwar's Racism tweet goes viral. Ankita Konwar tweeted that, If you’re from Northeast India, you can become an Indian ONLY when you win a medal for the country.Otherwise we are known as “chinky” “Chinese” “Nepali” or a new addition “corona”. India is not just infested with casteism but racism too.Speaking from my experience
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X