మహేష్ బాబు ఫ్యామిలీకి పవన్ ఇంటి నుంచి ప్రత్యేక కానుక.. నమ్రత పోస్ట్ వైరల్
టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోల మధ్య ఉండే స్నేహం గురించి అందరికి తెలిసిందే. సినిమాల విషయం పక్కనపెడితే కొంతమంది స్టార్స్ మాత్రం చాలా స్నేహంగా ఉంటారు. ఇక మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ అంతగా క్లోజ్ కాకపోయినప్పటికి చాలా సందర్భాల్లో ఒకటిగా నిలబడ్డారు. ఇక ఇటీవల మహేష్ బాబు ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ ఇంటి నుంచి ఒక ప్రత్యేకమైన కానుక వెళ్లింది. అందుకు సంబందించిన నమ్రత పోస్ట్ సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారింది.

అభిమానులు సంతోషపడేలా..
మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ తరచుగా కలుసుకోకపోయినప్పటికీ చాలా వరకు ముఖ్యమైన సందర్భాల్లో ఒకరినొకరు విష్ చేసుకుంటారు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా మహేష్ చేసిన ట్వీట్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరంలేదు. అయితే చాలా రోజుల తరువాత మళ్ళీ పవన్, మహేష్ అభిమానులు సంతోషపడేలా ఒక అద్భుతమైన పోస్ట్ వైరల్ అవుతోంది.

క్రిస్మస్ కానుకగా అన్నా లెజ్‌నేవా గిఫ్ట్..
మహేష్ బాబు ఇంటికి ఇటీవల ఒక ప్రత్యేకమైన కానుక వెళ్లింది. ఆ విషయాన్నీ మహేష్ సతీమణి సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఇంతకీ ఆ గిఫ్ట్ ఎవరు పంపారంటే.. పవన్ భార్య అన్నా అన్నా లెజ్‌నేవా. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు నమ్రత. క్రిస్మస్ కానుకగా చాక్లెట్లు నిండిన ఒక స్పెషల్ బాక్స్ అలాగే ప్రత్యేకమైన నోట్ ఉంది.

మీరు బావుండాలని కోరుకుంటూ..
అది చాలా బావుందని కూడా నమ్రత కృతజ్ఞతలు తెలిపారు. స్పెషల్ గ్రీటింగ్ లో ఏముందంటే.. మీ గురించి హృదయపూర్వకంగా ఆలోచిస్తూ, ఈ పవిత్రమైన సీజన్ లో సున్నితమైన అద్భుతాల ద్వారా మీరు బావుండాలని, ఆశీర్వదించబడతారని ఆశిస్తున్నట్లు కోరుకుంటూన్నాను.. అన్నా, కళ్యాణ్. " అని అందులో స్పెషల్ గా రాసి ఉంది.

రానా కోసం కూడా స్పెషల్ గిఫ్ట్
ఇక ఆ స్పెషల్ కానుకకు నమ్రత ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. కేవలం మహేష్ బాబు ఫ్యామిలీకి అనే కాకుండా ఇండస్ట్రీలో చాలా మంది సినీ ప్రముఖులకు అన్నా తన క్రిస్మస్ కానుకలను పంపుతున్నారు. హీరో దగ్గుబాటి రానాకు కూడా ఆమె ప్రత్యేకంగా గ్రీటింగ్స్ తో పాటు గిఫ్ట్ ను కూడా పంపారు. అందుకు రానా ట్విట్టర్ ద్వారా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశాడు.


Click it and Unblock the Notifications











